BigTV English

Viswambhara: అన్ని డేట్స్ వదిలేస్తే.. ఇంకెప్పుడు విశ్వంభర.. నువ్వొచ్చేది ?

Viswambhara: అన్ని డేట్స్ వదిలేస్తే.. ఇంకెప్పుడు విశ్వంభర.. నువ్వొచ్చేది ?

Viswambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి విశ్వంభర. బింబిసార సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న  డైరెక్టర్ వశిష్ఠ తన రెండో సినిమాగా చిరంజీవితో విశ్వంభర మొదలుపెట్టాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


 

జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి కథతోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఆ డేట్ ను గేమ్ ఛేంజర్ కి ఇచ్చేసి… పక్కకు తప్పుకున్నాడు. అలా ఒక్కో నెల.. ఒక్కో కారణంతో విశ్వంభర రిలీజ్ వాయిదా పడుతూనే వస్తుంది. మార్చి, ఏప్రిల్, మే ఇలా మూడు నెలలు గడిచిపోయాయి.  విఎఫ్ ఎక్స్ ఇంకా పూర్తి కాలేదని.. దానికోసం కోట్లు ఖర్చుపెడుతున్నారని.. అందుకే రిలీజ్ వాయిదా పడుతూ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.


 

అలా అనుకున్నా జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఈలోపు వేరే  సినిమాలు తమ డేట్స్ ను లాక్ చేసుకుంటూనే ఉన్నాయి. ఇంకా 6 నెలలు మాత్రమే ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ కు రెడీఅవుతోంది. కనీసం సినిమా సినిమాకు మధ్య 3, 4 నెలలు అయినా గ్యాప్ ఉండాలి. ఆ లెక్కన చూస్తే విశ్వంభర జూలై లో రిలీజ్ అవ్వాలి. జూలైలో కూడా మంచి మంచి సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.

 

నిన్ననే ఘాటీ కూడా జూలై 11 న వస్తున్నట్లు ప్రకటించింది.  కనీసంలో కనీసం జూలై చివరివారంలో వచ్చినా ఆగస్టులో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేవరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది. కలక్షన్స్ వస్తాయి. ఇక ఇప్పుడు కాకపోతే విశ్వంభరకు డేట్స్ దొరకడం చాలా కష్టం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చివరకు రాజాసాబ్ కూడా డేట్ ను ఫిక్స్ చేసుకున్నాడు. కానీ, చిరుకు మాత్రం ఒక్క డేట్ దొరకడం లేదు. మొదట్లోనే మంచి మంచి డేట్స్ అన్ని వదిలేసుకున్నాడు. ఇక ఇప్పుడు అలాంటి డేట్స్ దొరకాలి అంటే కష్టమే.

 

ఇక ఇంకోపక్క మెగా ఫ్యాన్స్.. విశ్వంభర విషయంలో  అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ ఉంటుందా.. కుర్ర హీరోలు సైతం మంచి మంచి డేట్స్ ను లాగేసుకుంటున్నారు. మెగాస్టార్ కు మాత్రం డేట్ దొరకడం లేదా.. ? అని ప్రశ్నిస్తున్నారు.  ప్రస్తుతం చిరు.. అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నాడు. విశ్వంభర రిలీజ్ ఏమో కానీ, చిరు ఫోకస్ అంతా సంక్రాంతి సినిమాపైనే ఉందని తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఎప్పుడు విశ్వంభరను రంగంలోకి దింపుతాడో అనేది పెద్ద మిస్టరీగా మారింది.  మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×