ఆపద ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టం. అందుకే, ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా షార్ప్ గా ఆలోచించాలి. ఆలోచించడమే కాదు, ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవాలి. లేదంటే, ప్రయాణాలకే ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. తాజాగా ప్రమాద సమయంలో ఓ యువకుడు స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆపద సమయంలో ఎలా రియాక్ట్ కావాలో సదరు యువకుడిని చూసి నేర్చుకోవాలంటున్నారు నెటిజన్లు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తాజాగా ముగ్గురు యువకులు ఓ బైక్ మీ జర్నీ చేస్తున్నారు. అదీ అతి వేగంగా. సరిగ్గా నాలుగు రోడ్లు కలిసే చోటుకు వచ్చారు. ఇంతలో పక్క నుంచి ఓ మినీ వ్యాన్ వచ్చింది. దాన్ని తప్పించబోయి సదరు యువకుడు బైక్ ను నేరుగా మురికి కాల్వలోకి పోనిచ్చాడు. బైక్ నేరుగా వెళ్లి బ్రిడ్జి మీది నుంచి నీళ్లలో పడిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ముగ్గురు యువకులు బైక్ మీద వెళ్తుండగా, వెనుక ఉన్న అబ్బాయి క్షణాల ముందే ప్రమాదాన్ని పసిగట్టాడు. బైక్ బ్రిడ్జి మీద నుంచి మురికి కాల్వలో పడబోయే సమయంలో వేగంగా బైక్ దిగే ప్రయత్నం చేశాడు. బ్రిడ్జి మీది నుంచి వాహనాలు పడిపోకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన పైపును పట్టుకున్నాడు. సేఫ్ గా బయటపడ్డాడు. మిగతా ఇద్దరు నేరుగా బైక్ తో సహా వెళ్లి కాల్వలో పడ్డారు.
Read Also: ఆటో డ్రైవర్ ను చెప్పుతో కొట్టి, కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్!
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెనుక కూర్చున్న యువకుడి తెలికి అందరూ ఫిదా అవుతున్నారు. వీడు మనిషా? స్పైడర్ మ్యానా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. “భూమ్మీద నూకలు ఉంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రాణాలతో బయటపడతారు అనేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంఫుల్” అని మరికొంత మంది రాసుకొస్తున్నారు. ‘బహుశ ఆ అబ్బాయి బ్యాక్ బెంచర్ అయి ఉంటాడు. అందుకే స్పాంటేనియస్ గా తప్పించుకున్నాడు” అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. “ఆపదలు ఎవరికైనా వస్తాయి. వాటి నుంచి తెలివిగా బయటపడ్డవాళ్లే గొప్పవాళ్లు. ఈ అబ్బాయి కూడా ఆ కోవకే చెందిన వాడు. జీవితంలో ఎలాంటి సమస్య నుంచి అయినా తప్పించుకునే శక్తి తనకు ఉంటుంది” అని ఇంకో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నది.
Read Also: వామ్మో ఇదేం ఇండియన్ బీచ్, నెట్టింట ఫారినర్ వీడియో వైరల్!