Kamal Haasan:లోక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమలహాసన్ (Kamal Haasan) కోలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా బాల నటుడిగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన కమలహాసన్.. గత ఏడాది ‘భారతీయుడు 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (S.Shankar) దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అంతకుముందు దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలోనే వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కమలహాసన్ ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఈ సినిమా.. సూపర్ హిట్ కావడంతో మళ్లీ 22 ఏళ్ల తర్వాత ఇండియన్ 2ని కూడా తెరకెక్కించడం జరిగింది. ఇకపోతే సరైన రైటర్ లేకపోవడం వల్లే డైరెక్టర్ శంకర్ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైటర్ సుజాత (Writer Sujatha) ‘రోబో’ చిత్రం తర్వాత మరణించడంతో శంకర్.. రోబో తర్వాత తీసిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. దీనికి తోడు ఇటీవల ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రామ్ చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
ఇండియన్ 3 నుండి తప్పుకున్న లైకా ప్రొడక్షన్స్..
అటు ఇండియన్ 2 కూడా డిజాస్టర్ అవడంతో శంకర్ నుంచి వస్తున్న ‘ఇండియన్ 3’ పై అంచనాలు పెద్దగా లేవనే చెప్పాలి. ముఖ్యంగా ఇండియన్ 2 చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించగా.. ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 3 సినిమా నిర్మాణం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియన్ 3 సగం షూటింగ్ పూర్తి అయిందని శంకర్ తెలియజేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో లైకా సడన్ గా తప్పుకోవడంతో కమలహాసన్ కు పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు.ఇక మిగిలిన సగం సినిమాను పూర్తీ చేయాలంటే .. రూ.30 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాలని భారీ డిమాండ్ చేశారట శంకర్. ఈ నేపథ్యంలోనే అంత రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేక లైకా ప్రొడక్షన్స్ వారు తప్పుకున్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి రెడ్ జాయింట్..
అయితే ఇప్పుడు రంగంలోకి రెడ్ జాయింట్ సంస్థ వారు దిగినట్లు సమాచారం. రెడ్ జాయింట్ సంస్థ .. ఇండియన్ 3 కోసం మిగిలిన షూటింగ్ సన్నివేశాల్ని నిర్మించడానికి సిద్ధంగా ఉందని చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం కమల్ హాసన్ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం (ManiRatnam) దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే సినిమా చేస్తున్నారు. మొత్తానికైతే దర్శకుడు అత్యధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం వల్లే పూర్తిగా నష్టపోయిన లైకా ప్రొడక్షన్స్ ఇప్పుడు అంత డబ్బు ఇచ్చుకోలేక ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా శంకర్ తేరుకొని వీరిని నమ్మి, పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన రెడ్ జాయింట్ వారికి లాభాలు చేకూర్చేలా సినిమా చేస్తారా? లేదా ?అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికైతే రైటర్ సుజాత చనిపోయిన తర్వాతే శంకర్ కి కలిసి రావడంలేదని, అందుకే మళ్ళీ సుజాత లాంటి రైటర్ పడితే తప్ప శంకర్ కం బ్యాక్ ఇవ్వలేరని కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tollywood: అక్కడ ప్రభాస్ వల్ల కానిది.. తారక్ వల్ల అవుతుందా..?