BigTV English

Lifetime Ban Politicians Convicted Criminals: క్రిమినల్‌ కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై జీవితకాలం నిషేధం కుదరుదు.. సుప్రీంలో కేంద్రం వాదన

Lifetime Ban Politicians Convicted Criminals: క్రిమినల్‌ కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై జీవితకాలం నిషేధం కుదరుదు.. సుప్రీంలో కేంద్రం వాదన

Lifetime Ban Politicians Convicted Criminals| క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయిన రాజకీయ నాయకులపై జీవితకాలం ఎన్నికల నిషేధం విధించాలన్న కోరికను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయవ్యవస్థకు సంబంధం లేదని పరోక్షంగా సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.


ప్రస్తుతం, ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 8(1) మరియు సెక్షన్ 9 ప్రకారం, క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయిన రాజకీయ నాయకులపై ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించే ప్రక్రియ అమల్లో ఉంది. అయితే, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయితే, వారిపై ఆరేళ్ల నిషేధం సరిపోదని, జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని సీనియర్ అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించాలని కోరారు.

ఈ విషయంపై విచారణలో భాగంగా, రాజ్యాంగ చెల్లుబాటుపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 10న కోరింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.


కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో.. క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయిన నాయకులపై జీవితకాలం ఎన్నికల నిషేధం విధించడం అత్యంత కఠినమైన చర్య అవుతుందని పేర్కొంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఆరేళ్ల నిషేధం విధించడం సరిపోతుందని తెలిపింది. అయితే దోషులుగా నిర్ధారణ అయిన నాయకులపై జీవితకాల నిషేధం విధించాలా లేదా ఆరేళ్ల నిషేధం విధించాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని కేంద్రం స్పష్టం చేసింది.

Also Read: దేశంలో ప్రజలందరికీ పెన్షన్.. కొత్త పథకం తీసుకురానున్న కేంద్రం

కేంద్రం సమర్పించిన అఫిడవిట్లో ముఖ్యాంశాలు:

నేరాల నిరోధానికి ఎంత కాలం పాటు, ఎటువంటి శిక్ష విధించాలన్నది సమతుల్యంగా,  సహేతుకంగా ఉండాలి. శిక్ష కఠినత్వం మితంగా ఉండాలి.

చట్టాన్ని సవరించాలని లేదా కొత్త చట్టాన్ని రూపొందించాలని పార్లమెంటును నిర్దేశించడం కోర్టుల న్యాయసమీక్ష అధికార పరిధిని మించిన విషయం.

పిటిషనర్ లేవనెత్తిన అంశం విస్తృత పర్యవసానాలతో ముడిపడి ఉంది. ఇది ప్రధానంగా పార్లమెంటు శాసన విధాన పరిధిలోకి వస్తుంది. పిటిషనర్ సూచనల ప్రకారం ముందుకు వెళితే, కోర్టుల న్యాయసమీక్ష అధికారాన్ని కూడా మార్చుకోవలసి రావచ్చు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 8(1) ప్రకారం, ప్రజా ప్రతినిధులపై విధించే గరిష్ఠ అనర్హత సమయం ఆరేళ్లు. దోషిగా నిర్ధారణ అయితే, తీర్పు వెలువడిన తేదీ నుంచి లేదా జైలు నుంచి విడుదలైన తేదీ నుంచి ఈ నిషేధం వర్తిస్తుంది. దీనిని జీవితకాల నిషేధంగా మార్చడం సరికాదు. అలాంటి మార్పులు చేసే అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 102, ఆర్టికల్ 191 ప్రకారం.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు అసెంబ్లీ లేదా పార్లమెంటుకే ఉంది. అలాంటి వారికి ఎంతకాలం బహిష్కరించాలి.. అనే చట్టం చేసే హక్కు కూడా పార్లమెంటుకి మాత్రమే ఉంది.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×