BigTV English
Advertisement

Maa Oori Polimera 2 Review : వెన్నులో వణుకు.. మా ఊరి పొలిమేరా- 2 సాగిందిలా..! మూవీ ఎలా ఉందో తెలుసా?

Maa Oori Polimera 2 Review : వెన్నులో వణుకు.. మా ఊరి పొలిమేరా- 2 సాగిందిలా..!  మూవీ ఎలా ఉందో తెలుసా?
Maa Oori Polimera 2

Maa Oori Polimera 2 Review(Latest film review) : దసరా హడావిడి పూర్తయింది అంటే పెద్ద సినిమాల హడావిడి కూడా పూర్తయిందని అర్థం. ఇక ప్రస్తుతం థియేటర్లలో ఎక్కువగా చిన్న సినిమాల సందడి మొదలవుతుంది. అలా ఈరోజు విడుదలైన చిత్రం మా ఊరి పొలిమేర 2. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎటువంటి హడావిడి లేకుండా ఓటీటీ లో విడుదలై సంచలనం సృష్టించింది. మరి ఇప్పుడు ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో.. థియేటర్లలో ఏ రేంజ్ లో భయపెట్టిందో తెలుసుకుందాం పదండి.


స్టోరీ: ఈ మూవీకి సంబంధించిన మొదటి భాగంలో జంగయ్య (బాలాదిత్య) తన అన్న కొమిరి ( సత్యం రాజేష్) ..కవిత(రమ్య) ను చేత బడి చేసి చంపినట్లు తెలుసుకుంటాడు . కవిత చితిలో కాలిపోయిన కొమిరి కేరళలో జీవిస్తున్నట్టు క్లైమాక్స్లో చూపిస్తారు. ఇక దానికి కంటిన్యూవేషన్ గా పొలిమేర 2 స్టోరీ ఉంటుంది.జాస్తిపల్లి కి కొత్తగా వచ్చిన ఎస్ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) కొమిరి పాత కేసును తిరిగి ఓపెన్ చేస్తాడు. ఈ నేపథ్యంలో అనుకోని నిజాలు బయటికి వస్తాయి. అసలు జంగయ్య ఆఖరి నిమిషంలో కేస్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు అనే దిశగా అతని ఎంక్వయిరీ జరుగుతుంది.

ఆ ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాదమూర్తి గుడికి కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడికి మధ్య.. కొమిరి చేసే క్షుద్ర పూజలకు మధ్య ఏదో లింకు ఉందని అతను కనిపెడతాడు. కొమిరి బలిజ భార్యను కేరళకు తీసుకువెళ్లాడు అన్న విషయం అర్థం అవుతుంది. అయితే అతని వెంట బలిజ భార్య ఎందుకు వెళ్ళింది? కవిత ఏమైంది? ఊరి పొలిమేరలో ఉన్న గుడి వెనక రహస్యం ఏమిటి? ఆ గుడికి అనంత పద్మనాభ స్వామి గుడి తో ఉన్న సంబంధం ఏమిటి? అసలు కుమిలి చేతబడి వెనుక రహస్యం ఏమిటి? తెలియాలి అంటే చిత్రం చూడాల్సిందే.


విశ్లేషణ: మా ఊరి పొలిమేర మూవీ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్టులను బట్టి రాబోయే సీక్వెల్ పై ఆసక్తి బాగా పెరిగింది. దాన్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా అద్భుతమైన ట్విస్టులతో పొలిమేర 2 చిత్రాన్ని దర్శకుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలి అనే ప్రయత్నంలో కథను కాస్త అటుకులు బొంతలా తయారు చేశాడు. చాలావరకు సీన్స్ గతానికి వర్తమానానికి తిరుగుతూ ఉండడంతో కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది.

ఇక క్లైమాక్స్ లో పొలిమేర 1కి ఇచ్చినట్లుగానే పొలిమే 3 కోసం అంకురార్పణ చేస్తూ కొన్ని ప్రశ్నలను వదిలిపెట్టాడు డైరెక్టర్. అన్నని వెతుకుతూ వెళ్లిన జంగయ్య ఏకంగా హిమాలయాల్లో నాగసాధువుల దగ్గరికి వెళ్ళిపోతాడు. మరోవైపు జాస్తిపల్లి లో ఉన్న గుడికి కేరళలో గుడికి కొత్త కనెక్షన్ బయట పడుతుంది. కొమిరి చేతబడి వెనక ముఖ్య కారణం ఆ ఊరి పొలిమేరలో ఉన్నటువంటి ఏకపాదమూర్తి ఆలయంలోని నిధి.. దాని వెనక కథ కూడా బాగా ఆసక్తికరంగా ఉంది. కొమిరి కవితపై రేణుక అవతారాన్ని ప్రయోగించడం.. తిరిగి ఆమెను కాపాడుకునే సీక్వెన్స్ చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుంది.

ఇంటర్వెల్ తరువాత ఉన్న యాక్షన్ ఎపిసోడ్ అలా ఆసక్తికరంగా సాగుతుంది. కానీ ఎందుకో కోమిరి ,బలిజ భార్యకి మధ్య ఉన్న సంబంధం వెనుక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో లాజిక్ లేదు అనిపిస్తుంది. ఇక లాస్ట్ కి వచ్చేసరికి ఏకపాదమూర్తి ఆలయం కు ఉన్న నాగబంధనం కొమిరి విముక్తి చేసే తీరు ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఫైనల్ గా కొమిరి భార్య లక్ష్మి పాత్రలో కొత్త కోణాన్ని చూపిస్తారు. ఈ మూవీలో ప్రతి ఒక్కరూ తమ క్యారెక్టర్ కి తగిన నటన అద్భుతంగా అందించారు.

ప్లస్ పాయింట్స్:

కథలోని ట్విట్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి.

ఈ మూవీకి సత్యం రాజేష్ నటన అద్భుతమైన ప్లస్ పాయింట్ అనడంలో డౌట్ లేదు.

ఏంట్రా వాళ్ళకి ముందు సీక్వెన్స్ అద్భుతంగా ఉంది.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కథనం కాస్త స్లోగా ఉంటుంది. 

కొన్ని సన్నివేశాల్లో లాజిక్ అస్సలు లేదు.

చాలా వరకు సీన్స్ గతానికి..వాస్తవానికి మధ్య తిరగడంతో చూసేవాళ్ళకి కాస్త కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది.

రేటింగ్: 2.75/5

చిత్రం: మా ఊరి పొలిమేర 2

నటీనటులు: సత్యం రాజేష్, కామాక్షి

భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి, గెటప్ శ్రీను,

సాహితి దాసరి 

 సంగీతం: గ్యానీ

సినిమాటోగ్రఫీ: కుషేందర్ రమేష్ రెడ్డి

 ఎడిటింగ్: శ్రీ వర

నిర్మాత: గౌర్ కృష్ణ

దర్శకత్వం: అనిల్ విశ్వనాథ్

విడుదల: నవంబర్ 3, 2023

చివరి మాట: మంచి థ్రిల్లింగ్ మూవీ చూడాలి అనుకునే వారికి పొలిమేర టు సూపర్ ఆప్షన్. దెయ్యాలు ,భూతాలు ,చేతబడిలు ఇట్లాంటి చిత్రాలు నచ్చే వాళ్ల కి ఈ మూవీ కన్ఫామ్ గా నచ్చుతుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×