Maadhavi Latha: ఆంటీ అని పిలిస్తే ఆడవారికి నచ్చదు అనే ఒపీనియన్ చాలామందిలో వచ్చేసింది. ముఖ్యంగా వెండితెరపై వెలిగే సెలబ్రిటీలకు అస్సలు నచ్చదు. ఇప్పటికే చాలామంది నటీమణులు తమకు ఆంటీ అనే పిలుపు అంటే ఎంత ద్వేషమో ఓపెన్‌గా చెప్పేశారు. అందులో యాంకర్ అనసూయ కూడా ఒకరు. తనను ఆంటీ అని పిలవొద్దని చాలామంది నెటిజన్లకు చాలాసార్లు ఓపెన్‌గా వార్నింగ్ ఇచ్చింది అనసూయ. ఇప్పుడు అదే లిస్ట్‌లోకి నటి మాధవీ లత కూడా చేరింది. అసలు తనను ఆంటీ అని ఎవరు అన్నారో, ఎప్పుడు అన్నారో తెలియదు కానీ.. సోషల్ మీడియా వేదికగా తనను ఆంటీ అనేవారికి గట్టి వార్నింగే ఇచ్చింది మాధవీ లత.
అదే డౌట్
‘కొందరు పొట్ట బట్ట ఉన్న అంకుల్స్, మరి కొంతమంది సైకోస్ నన్ను ముసలిదానివి అయిపోయావు అంటున్నారు. వయసు, జీవితం అనేది వాళ్లకు కూడా శాశ్వతం కాదు అనే నిజం ఎలా మర్చిపోయారు? నా ఏజ్ వచ్చేసరికి మరణం అంచులో ఉండే యువత కూడా నన్ను అంటుంటే నా ఒక్కదానికే వయసు అవుతుందా, మీరంతా శాశ్వత జీవులా అనే డౌట్ వస్తుంది సుమీ.! సృష్టి ధర్మం నేను గౌరవిస్తాను. అవును.. నేను పుట్టాను, పెరిగాను. నాకు వయసు అవుతుంది. కొన్నాళ్లకి మరణిస్తాను. దీన్ని ఆపగలిగే దమ్మున్న మనుషులు శాశ్వతంగా ఉండండి. మా ఊరిలో ఒక సామెత చెప్తారు.. అర్ధరాత్రి చచ్చేవాడు తెల్లారు ఝామున చచ్చేవాడి చావు కోరుకున్నాడట’ అంటూ సామెతలను ఉదాహరణలుగా తీసుకొని మరీ అందరికీ కౌంటర్ ఇచ్చింది మాధవీ లత.
Also Read: ‘సంక్రాంతికి వస్తున్నాం’తో నా కల నెరవేరింది, మొదటిసారి అలా.. సంతోషంలో మీనాక్షి
ప్రకృతి ధర్మం
‘అవును నాకు వయసు పెరుగుతుంది. చర్మంపై ముడతలు వస్తాయి. తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఇది ప్రకృతి ధర్మం.. సహజం. మీరు నన్ను ఆంటీ అని పిలిచినా, అవ్వ అని పిలిచినా నాకేం సమస్య లేదు. సమస్య అనేది మీ మెదడులో ఉంది అనే సంగతి గమనించి.. నాకోసం ఆలోచించే సమయంలో మీకోసం ఆలోచిస్తే కనీసం నా ఏజ్ వచ్చేసరికి అంకుల్ కాకుండా ఉంటారు. 50 ఏళ్ల అంకుల్ నన్ను ఆంటీ అని పిలిస్తే అతని ఆలోచన స్థాయి ఏమిటి? మీరెలా పిలిచినా మీ వయస్సుని ఆపలేను. నా మనసుని మార్చలేరు. ఆపాలి అనే ఆలోచన నాకు లేదు. శాశ్వత అందం కావాలని కోరిక లేదు’ అని చెప్పుకొచ్చింది మాధవీ లత.
అమ్మానాన్నలకు అన్నం పెట్టండి
‘మీ సంస్కారానికి నా పాదాభివందనాలు. నన్ను దూషణ మానేసి వయసు అయిపోయిన మీ అమ్మానాన్నలకి అన్నం పెట్టండి. నన్ను దూషించిన పాపం పోతుంది. శత్రు వినాశన ప్రాప్తిరస్తు’ అంటూ తన అభిప్రాయాన్ని పూర్తిగా వివరించింది మాధవీ లత. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పోస్ట్ చూసిన నెటిజన్లంతా ఆంటీ అని పిలిస్తే ఫైర్ అయ్యేవారి లిస్ట్‌లో మాధవీ లత (Maadhavi Latha) కూడా యాడ్ అయ్యిందని ఫీలవుతున్నారు.