BigTV English

MAD Square Business: ‘మ్యాడ్ స్వ్వేర్’ బ్రేక్ ఈవెన్ పాయింట్.. కుర్రాళ్ల ముందు కొండంత టార్గెట్

MAD Square Business: ‘మ్యాడ్ స్వ్వేర్’ బ్రేక్ ఈవెన్ పాయింట్.. కుర్రాళ్ల ముందు కొండంత టార్గెట్

MAD Square Business: ఈరోజుల్లో సినిమాకు మౌత్ టాక్ బాగుందంటే చాలు.. అందులో స్టార్ హీరోలు ఉన్నారా, యంగ్ హీరోలు ఉన్నారా, డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించాడా, పెద్ద సంస్థ నుండి వచ్చిందా.. ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. మూడు గంటల పాటు వారిని ఎంటర్‌టైన్ చేస్తే చాలు.. సినిమా సూపర్ హిట్. అందుకే అలా సూపర్ హిట్ అయిన సినిమాలకు మరింత భారీ బడ్జెట్‌తో సీక్వెల్స్ తెరకెక్కించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్. యావరేజ్ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలు మౌత్ టాక్‌తో హిట్ అవ్వడంతో దానికి మరింత భారీ బడ్జెట్ పెట్టి సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ విషయంలో కూడా అదే జరుగుతోంది.


పెరిగిన బడ్జెట్

రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా ఇప్పటికే ‘మ్యాడ్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీ అప్పట్లో కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినా దానికి షేర్ మాత్రం రూ.9.6 కోట్లు వచ్చాయి. అప్పట్లో ఈ మూవీ బడ్జెట్ విషయంలో మేకర్స్ ఎక్కువగా రిస్క్ తీసుకోలేదు. పైగా పెట్టిన పెట్టుబడికి ట్రిపుల్ లాభం వచ్చింది. అదే నమ్మకంతో ఇప్పుడు దీని సీక్వెల్‌కు విపరీతంగా ఖర్చు పెట్టేశారు మేకర్స్. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ‘మ్యాడ్ స్క్వేర్’ బడ్జెట్ రూ.10 కోట్లు అని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీటైల్స్ కూడా బయటికొచ్చాయి.


Also Read: ‘రాబిన్‌హుడ్’ హానెస్ట్ పోడ్కాస్ట్.. మరి వెన్నెల కిషోర్ హానెస్ట్‌గా ఆన్సర్ ఇచ్చాడా.?

బిజినెస్ లెక్కలు

‘మ్యాడ్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో దాని సీక్వెల్ అయిన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square)కు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే బిజినెస్ జరిగింది. నైజాం ఏరియాలో ఈ సినిమాకు రూ.6.5 కోట్ల బిజినెస్ జరిగింది. సీడెడ్‌లో రూ.2 కోట్లు, ఆంధ్రలో రూ.7 కోట్ల బిజినెస్ చేసింది ఈ సినిమా. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ‘మ్యాడ్ స్క్వేర్’కు రూ.,15.5 కోట్ల బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల విషయాన్ని పక్కన పెడితే మిగతా రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ.2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.5 కోట్ల బిజినెస్ జరిగింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి రూ.21 కోట్ల బిజినెస్ జరిగింది. ఆ లెక్కన చూస్తే ‘మ్యాడ్ స్క్వేర్’కు రావాల్సిన బ్రేక్ ఈవెన్ షేర్ భారీగా పెరిగిపోయింది.

బ్రేక ఈవెన్ ఎంతంటే.?

ప్రపంచవ్యాప్తంగా ‘మ్యాడ్ స్క్వేర్’కు రూ.21 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.22 కోట్ల కలెక్షన్స్ సాధించాల్సిందే. దీన్ని బట్టి చూస్తే నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ లాంటి యంగ్ హీరోలు ముందు భారీ టార్గెటే ఉంది. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సీక్వెల్ కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. టైర్ 2 హీరోలు ఉన్న సినిమాలు సైతం మంచి మౌత్ టాక్ అందుకున్నా అప్పుడప్పుడు రూ.20 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టలేవు. అలాంటి ‘మ్యాడ్ స్క్వేర్’ ముందు ఈ టార్గెట్ కాస్త భారీ అనే చెప్పాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×