Rishabh Pant: టి-20 క్రికెట్ అంటేనే వేగానికి మారుపేరు. మైదానంలో ఉన్న ప్రతిక్షణం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆటగాళ్లు ఏ చిన్న తప్పు చేసినా మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఒక్క క్యాచ్ మిస్ చేసినా దాదాపు మ్యాచ్ చేజారినట్టే. ఐపీఎల్ 2025 లో భాగంగా సోమవారం రోజు ఢిల్లీ క్యాపిటల్స్ – లక్నో సూపర్ జెంయిట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లొ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
Also Read: Sehwag on Gill: గిల్ వెస్ట్ ఫెలో… కెప్టెన్సీ కూడా రాదు?
విశాఖపట్నం వేదికగా లక్నో – ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో జట్టుపై ఢిల్లీ అనూహ్య విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ {Rishabh Pant} పేలవ ప్రదర్శన కనబరిచాడు. అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్ లో తీవ్రంగా నిరాశపరిచి.. కెప్టెన్ గాను విఫలమయ్యాడు. పంత్ చెత్త కేప్టెన్సీ కారణంగా 210 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో కాపాడుకోలేకపోయింది. ఫలితంగా సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ లొ లక్నో ఓటమిపాలైంది.
నిజానికి ఈ మ్యాచ్ 14వ ఓవర్ వరకు లక్నో చేతిలోనే ఉంది. 7 ఓవర్ వరకు ఢిల్లీ జట్టు పెవిలియన్ లో కూర్చుంది. అప్పటికి జట్టు స్కోర్ కేవలం 66 పరుగులే ఉంది. ఇక లక్నో విజయం ఖాయం అనుకున్న సమయంలో అశుతోష్ వర్మ {66*} పరుగులతో విరుచుకుపడి ఢిల్లీ జట్టును గెలిపించాడు. అయితే చివరి ఓవర్ లో ఢిల్లీ చివరి బ్యాటర్ మోహిత్ శర్మను స్టంప్ అవుట్ చేసే అవకాశాన్ని రిషబ్ పంత్ చేజార్చుకున్నాడు. షాబాజ్ లెగ్ సైడ్ వేసిన బంతిని పంత్ పట్టుకోలేకపోయాడు.
క్రీజ్ నుండి దూరంగా ముందుకు వెళ్లి మోహిత్ ని అవుట్ చేయలేకపోయాడు. ఒకవేళ పంత్ ఆ స్టంప్ అవుట్ చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. అటు బ్యాటింగ్ లోను పంత్ డకౌట్ గా వెనుతిరిగాడు. అలాగే అశుతోష్ వర్మ ఇచ్చిన క్యాచ్ ని కూడా వదిలేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడైన పంత్.. ఇలా అన్ని విభాగాలలో విఫలం కావడంతో లక్నో ఓటమిపాలైందని పలువురు మాజీ క్రికెటర్లు చెబుతున్నారు.
Also Read: Mohammad Siraj: సిరాజ్ మామూలోడు కాదు.. మరో కొత్త అమ్మాయితో డేటింగ్..!
అయితే లక్నో రిషబ్ పంత్ ని 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఒక జట్టు ఐపిఎల్ సీజన్ లో కనీసం 14 మ్యాచ్ లు ఆడుతుంది. దీని ప్రాతిపాదికన పంత్ మ్యాచ్ ఫీజు దాదాపు రెండు కోట్లు. అంటే తొలి మ్యాచ్ లో డకౌట్ అయినా.. అతడి సంపాదన రెండు కోట్లు. ఈ క్రమంలో పంత్ ఆడిన ఆరు బంతులకు 30 లక్షల చొప్పున సంపాదించినట్లుగా తెలుసుకోవచ్చు. ఇలా పంత్ మ్యాచ్ లో అన్ని విభాగాలలో ఫెయిల్ అయినా కోట్లు సంపాదిస్తున్నాడని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తరువాతి మ్యాచ్ లోనైనా ఏ విధంగా రాణిస్తాడో వేచి చూడాలి.