Dilruba Movie: ‘క’ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం రేంజ్ మారిపోయింది. చాలా ఏళ్ల పాటు ఎదురుచూసిన హిట్ ‘క’ తో వచ్చింది. దీని తర్వాత స్టోరీ సెలక్షన్‌తో పాటు కిరణ్ అబ్బవరంలో మరెన్నో మార్పులు వస్తాయని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ.. ఇప్పుడు రాబోయే ‘దిల్‌రూబా’ మూవీని చూస్తే మాత్రం కిరణ్ అబ్బవరం ఇంకా మారలేదా.? అనే డౌట్ వస్తుంది. ఇప్పటివరకు విడుదలయిన ‘దిల్‌రూబా’ టీజర్, పోస్టర్స్ అన్ని చూస్తుంటే ఇదొక రిటీన్ లవ్ స్టోరీ అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో వచ్చేసింది. అయితే ఈ ‘దిల్‌రూబా’ కథ ముందుగా కిరణ్ అబ్బవరం దగ్గరకు కాకుండా వేరే హీరో దగ్గరకు వెళ్లిందట. అయితే ఆ హీరో రిజెక్ట్ చేయడంతో కిరణ్ అబ్బవరం వద్దకు వచ్చిందట.
నిర్మాత వారసుడి కోసం
మామూలుగా ఒక హీరో చేయాల్సిన కథతో మరొక హీరో సినిమా చేయడం అనేది చాలా కామన్. దర్శకులు సైతం ఒక హీరోను ఊహించుకొని కథ రాసుకున్నా కొన్ని తప్పని పరిస్థితుల వల్ల వేరే హీరోతో ఆ సినిమాను చేయాల్సి వస్తుంది. అలాగే ముందుగా ‘దిల్‌రూబా’ కథ కూడా వేరే వ్యక్తి దగ్గరకు వెళ్లిందట. ఒక ప్రముఖ నిర్మాత తన కుమారుడిని హీరో చేయాలనే ఆలోచనతో చాలాకాలంగా కథలను వింటూ వస్తున్నారు. అలాగే ‘దిల్‌రూబా’ కథను కూడా విన్నారు. కానీ తన వారసుడిని లాంచ్ చేయడం కోసం ఇది కరెక్ట్ కథ కాదని ఆయన అనుకోవడంతో ఆ కథ చివరికి కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) దగ్గరకు వచ్చింది. ఆ నిర్మాత మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య.
ఆయన రిజెక్ట్ చేశాడు
ఇప్పటికే టాలీవుడ్‌లో ఎన్నో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌ను తెరకెక్కించారు నిర్మాత డీవీవీ దానయ్య. ఇప్పుడు ఫైనల్‌గా తన కుమారుడు అయిన దాసరి కళ్యాణ్‌ను హీరో చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఆ లాంచ్ కోసం మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారు. అలా ‘దిల్‌రూబా’ (Dilruba) కథను విని వద్దనుకున్నారట. అలా కళ్యాణ్ దాసరి, డీవీవీ దానయ్య రిజెక్ట్ చేసిన కథ కిరణ్ అబ్బవరం దగ్గరకు వచ్చింది. ‘క’ తర్వాత మంచి లవ్ స్టోరీ చేయాలని అనుకున్నారో ఏమో.. అందుకే ‘దిల్‌రూబా’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు అబ్బవరం. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఒక నెల వాయిదా పడింది. ఫైనల్‌గా మార్చి 14న రిలీజ్ కానుంది.
Also Read: ‘కంగువా’ డిశాస్టర్.. భర్తకు సపోర్ట్ చేస్తూ జ్యోతిక కామెంట్స్..
అబ్బవరం కాన్ఫిడెన్స్
విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దిల్‌రూబా’లో కిరణ్ అబ్బవరంకు జోడీగా రుక్సార్ ధిల్లోన్ నటించింది. ఈ మూవీపై అబ్బవరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా ప్రేక్షకులు మాత్రం చాలావరకు ఇదొక రొటీన్ లవ్ స్టోరీ అని ఫిక్స్ అయిపోయారు. కాలేజ్‌లో నడిచే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అని భావిస్తున్నారు. ఇప్పటివరకు ‘దిల్‌రూబా’ నుండి టీజర్, పాటలు.. ఇలా చాలానే అప్డేట్స్ బయటికొచ్చాయి. అందులో ఒక్కదాంట్లో కూడా పెద్దగా కొత్తదనం లేదని ఫీలవుతున్నారు.