Rashmi Gautam..నితిన్(Nithin).. ప్రముఖ డైరెక్టర్ తేజ (Teja) దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ చిత్రంతో నితిన్ కెరియర్ మొదలయ్యింది. ఇందులో హీరోయిన్గా సదా తెలుగు తెరకు పరిచయమైంది. అటు తేజ కూడా అప్పటికే స్టార్ టెక్నీషియన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన మేకింగ్, టెల్లింగ్ స్టైల్ అన్నీ కూడా చాలా భిన్నంగా ఉండేవి. అలా ఒకప్పుడు ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘జయం’ అంటూ వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూసుకుపోయాడు. ఇక అందులో భాగంగానే జయం చిత్రానికి ముందుగా సదా (Sada) ని కాకుండా రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ను హీరోయిన్ గా అనుకున్నామని, ఈ విషయాన్ని తాజాగా రాబిన్ హుడ్ (Robin hood) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
జయం సినిమాలో హీరోయిన్ సదా కాదా..
ఇక అసలు విషయంలోకెళితే.. ఉగాది ఈవెంట్ అంటూ ఇటీవల ఒక టీవీ ఛానల్ లో సందడి చేసిన నితిన్ ఈ విషయాన్ని బయట పెట్టాడు. నితిన్ మాట్లాడుతూ..” జయం సినిమాకి రష్మీ, నేను కలిసి రిహార్సల్స్ చేసాము. దాదాపు 90% సీన్లు కూడా రష్మీ తోనే రిహార్సల్స్ చేయించారు. చివర్లో ఏమైందో తెలియదు కానీ హీరోయిన్ ని మార్చేశారు. ఒకవేళ ఆ సినిమా రష్మీ ఖాతాలో పడి ఉంటే ఖచ్చితంగా అప్పుడే ఆమె స్టార్ అయిపోయేది.కానీ సినీ ఇండస్ట్రీలో ఐడెంటిటీ కోసం, ఆఫర్ల కోసం రష్మీ బాగానే తిరిగినట్టు కనిపిస్తోంది” అంటూ నితిన్ తెలిపారు. మొత్తానికైతే రష్మీకి రావాల్సిన అదృష్టాన్ని సదా తన్నుకుపోయిందని ఇండైరెక్టుగా కామెంట్లు చేశారు నితిన్. ఒకవేళ సదా కాకుండా ఆ సినిమాలో రష్మి గనుక నటించి ఉండి ఉంటే.. నేడు సదా లాగే ఈమె కూడా స్టార్ హీరోయిన్ అయిపోయేదేమో కదా.. అందుకే అంటారు దేనికైనా అదృష్టం ఉండాలని అంటూ అభిమానులు సైతం నిట్టూరుస్తున్నారు. రష్మీ భారీ అదృష్టాన్ని, ఒక గొప్ప కెరియర్ ను కోల్పోయిందని చెప్పవచ్చు.
ఇండస్ట్రీలో అవకాశాలు లేక బుల్లితెరకే పరిమితం..
ఇకపోతే రష్మీ ఉదయ్ కిరణ్ (Uday Kiran) హీరోగా నటించిన ‘హోలీ’ చిత్రంలో కమెడియన్ సునీల్(Comedian Sunil) కి జోడిగా కనిపించింది. ఇక అప్పటి నుంచి పలు చిత్రాలలో హీరోయిన్గా నటిస్తూనే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కానీ ఆమెకు మాత్రం వెండితెర కలిసి రావడం లేదు. దీంతో బుల్లితెరకే పరిమితమైన ఈమె.. ఇక్కడ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కంటి షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ కి నో చెప్పిన ఈమె జబర్దస్త్ యాంకర్ గా మారిపోయిందని చెప్పవచ్చు. ఇకపోతే జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో సుధీర్ కి జోడిగా నటించి, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో దాదాపు 10 సంవత్సరాల పాటు ఇదే మైంటైన్ చేస్తూ.. ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సుధీర్ – రష్మీ జోడి అంటే ఇండస్ట్రీలోనే భారీ పాపులారిటీ.. వీరిద్దరూ నిజజీవితంలో కూడా వివాహం చేసుకోవాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. ఏదేమైనా రష్మీ మాత్రం స్టార్ కెరీర్ ను కోల్పోయి.. ఇప్పుడు బుల్లితెర మహారాణిలా ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు.