BigTV English

Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు పై “చిరు” సందేశం.. నిహారికపై అంత నమ్మకమా ?

Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు పై “చిరు” సందేశం.. నిహారికపై అంత నమ్మకమా ?

Chiranjeevi on Committee Kurrollu Movie(Latest news in tollywood): మెగా డాటర్ నిహారిక నిర్మాతగా.. యదువంశీ దర్శకత్వం వహించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9న విడుదలకు రెడీ అయింది. ఈ సినిమాతో చాలామంది కొత్త నటీనటులు వెండితెరకు పరిచయం అవుతున్నారు. ప్రసాద్ బెహరా.. మా విడాకులు, పెళ్లివారమండి, వింధ్య విహారి వంటి.. యూట్యూబ్ వెబ్ సిరీస్ తో బాగా ఫేమస్ అయ్యారు. ఈ సినిమాతో అతను కూడా నటించడంతో.. ఫుల్ పంచ్ లు, కామెడీ పండుతుందన్న అంచనాలున్నాయి. ఇటీవలే ట్రైలర్ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఇక నిన్నే కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. తన అన్న వరుణ్ తేజ్ చాలా సపోర్ట్ చేశాడని చెప్పుకొచ్చింది నిహారిక. మా బావ అంటూ.. సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయిదుర్గాతేజ్ గురించి కూడా మాట్లాడింది. ఈ సంవత్సరం తమ కుటుంబానికి అంతా మంచే జరుగుతుందని చెప్పింది నిహారిక. అన్న చరణ్ నటించిన సినిమా ఆస్కార్స్ కు వెళ్లడం, పెదనాన్న చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం, బాబాయ్ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం.. ఇప్పుడు తను కూడా నిర్మాతగా తొలి ప్రయత్నంతోనే సక్సెస్ అవుతానని తెలిపింది. అందుకు ప్రేక్షకుల సపోర్ట్ కూడా కావాలని కోరింది నిహారిక.

Also Read : చిన్ననాటి స్నేహితులను బద్ద శత్రువులుగా మార్చిన జాతర..


తాజాగా కమిటీ కుర్రోళ్ళు టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేశారు. “మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం ఆగస్టు 9న రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమాను ముందే చూశాను. చాలా బాగుంది. నిహారిక మల్టీ టాలెంటెడ్. మంచి ఆర్టిస్టే కాదు.. నిర్మాతగా కూడా మంచి అభిరుచి ఉంది. లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకుంటూ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా సినిమాలను ప్రొడ్యూస్ చేయడం తనకు తెలుసని నా నమ్మకం. అంతకుమించి.. మన తెలుగు ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా ఫ్రెష్ అండ్ ఎగ్జైట్ మెంట్ కంటెంట్ ఏదొచ్చినా చూసి ఆనందిస్తారు.. ఆదరిస్తారు.’

“కమిటి కూర్రోళ్ళు సినిమా గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరిలో 11 మంది స్నేహితుల మధ్య జరిగే కథ. డైరెక్టర్ యదు వంశీకి ఇది మొదటి సినిమా. స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ తానే చేశాడు. కొత్తమంది చాలా మంది పరిచయం అవుతున్నారు. రాజుకి కూడా ఇదే తొలి థియేట్రకల్ రిలీజ్. హనుమాన్ తో మంచిపేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ 11 పాటలను అందించారు. ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తాను.. కమిటీ కుర్రోళ్లకి, నిహారికకు ఆల్ ది బెస్ట్.” అని ఆ వీడియోలో పేర్కొన్నారు.

నిజంగానే కూతురిపై పెదనాన్నకు అంత నమ్మకం ఉందా అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఏదేమైనా పెళ్లి, విడాకుల తర్వాత.. నిహారిక తిరిగి తన కెరీర్ పై ఫోకస్ పెట్టి సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. కమిటీ కుర్రోళ్ళు చిత్రంతో నిహారిక కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×