Reventh reddy visits new york city(Today’s news in telugu): అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అనూహ్య ఆదరణ లభిస్తోంది. వారం రోజుల పర్యటన తర్వాత 14న తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అమెరికాలోనూ సీఎం రేవంత్ రెడ్డివద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని జై రేవంతన్న అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ బడా పారిశ్రామిక వేత్తలను కలుస్తున్నారు. ఇక్కడ ఉండే అవకాశాలు, పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలను వారికి చెబుతూ తన పర్యటన కొనసాగిస్తున్నారు.
నిరుద్యోగులకు ఉపాధి
ఎన్ఆర్ఐ ల పెట్టుబడులతో స్థాపించే పరిశ్రమల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఆయన పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది.రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ ను చూపిస్తూ తెలంగాణలో తనదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ నాయకత్తంపై సంపూర్ణ విశ్వాసం కనబరుస్తోంది. అటు పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ..ప్రతిపక్షాల కుట్రలను ఛేదిస్తూ..వారు చేసే విమర్శలను తిప్పికొడుతూ సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు.
అయితే అధికారంలోకి రాకముందు నుంచి నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని ..గత పాలకుల మాదిరిగా తాము నిరుద్యోగ యువతకు అన్యాయం చేయబోమని అంటున్నారు.
హైదరాబాద్ లోనూ టీ స్క్వేర్ హబ్
ఈ ప్రక్రియలో భాగంగానే తెలంగాణకు నూతన పరిశ్రమలు తీసుకొద్దామని భావిస్తున్నారు. పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగ యువతకు ఊతం లభిస్తుందని అనుకుంటున్నారు. అందుకోసమే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే ఎన్ఆర్ఐ పారిశ్రామిక వేత్తల కోసం అమెరికా పర్యటిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి అక్కడ అనూహ్య రీతిలో గౌరవం దక్కింది. న్యూయార్క్ సిటీలో నెలకొల్పిన టైమ్ స్క్కేర్ స్ట్రీట్ లో రేవంత్ రెడ్డి నిలువెత్తు ఫొటోలు, వీడియో దర్శనమిచ్చాయి. దీనితో రేవంత్ అభిమానులు సంబరపడుతున్నారు. హైదరాబాద్ లోనూ ఇదే తరహా టైమ్ స్క్వేర్ తరహాలో టి స్క్వేర్ మల్టీపర్పస్ హబ్ ను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిని రాయదుర్గంలో నిర్మించేందుకు ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. ఈ హబ్ నిర్మాణంలో హైదరాబాద్ కు గ్లోబల్ వైడ్ గా మరో గౌరవం దక్కనుంది.
EXCLUSIVE ⚡
Revanth Reddy, CM of Telangana being featured on the screens of Times Square, New York 🔥
Revath Reddy's popularity has reached one of the World's busiest pedestrian areas 🔥 pic.twitter.com/3LSYwdm5EM
— Rohini Anand (@mrs_roh08) August 6, 2024