BigTV English

Maha Shivratri 2024: మహా శివరాత్రికి స్పెషల్ షోస్.. కొత్త సినిమాల అప్డేట్లు కూడా రెడీ..!

Maha Shivratri 2024: మహా శివరాత్రికి స్పెషల్ షోస్.. కొత్త సినిమాల అప్డేట్లు కూడా రెడీ..!


Shivaratri Special Shows: మార్చి 8న అంటే రేపు మహాశివరాత్రిని దేశమంతటా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోబోతుంది. ఈ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సినీ ప్రియులను అలరించేందుకు పలు బ్లాక్ బస్టర్ సినిమాలను హైదరాబాద్‌లో స్పెషల్ షోలుగా ప్రదర్శించనున్నారు.

అర్థరాత్రి 12 గంటల నుంచి సుమారు ఒకటి లేదా రెండు షోలను ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, నిఖిల్, నాని, సిద్ధూ జొన్నల గడ్డ, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఆ సినిమాలెంటో తెలుసుకుందాం.


ప్రభాస్ – సలార్
నాని – దసరా
నిఖిల్ – కార్తికేయ 2
తేజా సజ్జా – హనుమాన్
ప్రభాస్ – రెబల్
సిద్ధూ జొన్నలగడ్డ – డీజే టిల్లు
నార్నే నితిన్ – మ్యాడ్
ఎన్టీఆర్ – అదుర్స్
పవన్ కల్యాణ్ – కెమెరామెన్ గంగతో రాంబాబు
చిరంజీవి – వాల్తేరు వీరయ్య
బాలకృష్ణ – వీరసింహారెడ్డి

READ MORE: గామా అవార్డుల ప్ర‌ధానోత్స‌వం.. విజేత‌లు వీరే

కాగా ఈ చిత్రాలకు సంబంధించిన బుకింగ్స్ ఆల్రెడీ ఆన్‌లైన్‌లలో ఓపెన్ అయ్యాయి. ఈ సినిమాలు ఏ ఏ థియేటర్‌లలో రన్ అవుతాయో బుకింగ్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీల ప్రత్యేక షోలతో పాటు మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలో కొత్త సినిమాల మధ్య కూడా పోటీ నెలకొంది. విశ్వక్ సేన్ గామి, గోపీచంద్ భీమా, ప్రేమలు వంటి సినిమాలు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

అయితే వీటితో పాటుగా పలు స్టార్ హీరోల సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణలో బిజీ బిజీగా ఉన్నాయి. మరి వాటి నుంచి ఏమైనా అప్డేట్లు వస్తాయేమో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో..

మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న కన్నప్ప మూవీ నుంచి ఇటీవల ఓ అప్డేట్ అందించారు. ఈ మూవీ నుంచి పవర్ ఫుల్ లుక్‌ని ఒకటి వదులుతామని మేకర్స్ ప్రకటించారు. అయితే అది శివునిగా నటిస్తోన్న ప్రభాస్‌దే అని అంతా అనుకుంటున్నారు.

అలాగే మరో రెండు నెలల్లో విడుదల కాబోతున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ నుంచి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ యూనిట్ ఓ సాంగ్ షూట్ కోసం ఇటలీలో ఉంది. దీంతో ఈ మహా శివరాత్రికి అప్డేట్ రాకపోవచ్చనే టాక్ నడుస్తోంది.

READ MORE: మూడు తరాల కుటుంబాల క‌థ‌తో శ‌ర్వానంద్ కొత్త చిత్రం

అలాగే చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర మూవీలో డివోషనల్ టచ్ ఉంది కాబట్టి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా రివీల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అంతేకాకుండా బాలకృష్ణ – బాబీ కొల్లి కాంబోలో 109 వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

అలాగే నాగార్జున – ధనుష్ కాంబోలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ నుంచి కూడా అప్డేట్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న లవ్ మీ టీజర్ రిలీజ్‌కు సిద్ధగా ఉంది. వీటితో పాటు మిడ్ రేంజ్ సినిమాల నుంచి కూడా పలు అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×