BigTV English

Sharwa @ 36: మూడు తరాల కుటుంబాల క‌థ‌తో శ‌ర్వానంద్ కొత్త చిత్రం!

Sharwa @ 36: మూడు తరాల కుటుంబాల క‌థ‌తో శ‌ర్వానంద్ కొత్త చిత్రం!


Sharwa @36: టాలీవుడ్ హీరో శర్వానంద్ చాలా కాలం నుంచి మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

అయితే నిన్న ఈ హీరో శర్వానంద్ బర్త్ డే. ఈ సందర్భంగా అతడు చేయబోయే సినిమాలకు సంబంధించిన పలు అప్డేట్లను మేకర్స్ పంచుకున్నారు. ఇందులో భాగంగా శర్వానంద్ తన కెరీర్‌లో 35వ సినిమాను చేయబోతున్నాడు. ఈ మూవీ ఎప్పుడో అనౌన్స్ అయింది.


అయితే శర్వానంద్ తన పెళ్లి పనుల్లో ఉండి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని మళ్లీ తన సినిమాలను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే నిన్న తన 35వ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను వదిలారు. ఈ మూవీకి గానూ ‘మనమే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

READ MORE: ఈ రోజు టీవీల్లో సందడే సందడి.. స్టార్ హీరోల సినిమాలు టెలికాస్ట్‌.. మొత్తం ఎన్ని సినిమాలంటే

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ మూవీలో శర్వానంద్‌కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ మూవీ ఓ నాలుగేళ్ల బాబు చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఇకపోతే శర్వానంద్ మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన కెరీర్‌లో 36వ సినిమాను నిన్న తన బర్త్ డే సందర్భంగా వెల్లడించారు.

ఈ మూవీని సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘లూజర్’ ఫేం దర్శకుడు అభిలాష్ కంకర డైరెక్ట్ చేయనున్నారు. యూవి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ ఈ మూవీని నిర్మించబోతున్నారు.కాగా శర్వాకు ఈ ప్రొడక్షన్ హౌస్ చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు వంటి మూడు సినిమాలు పెద్ద బ్లాక్‌బస్టర్‌లు అయ్యాయి. తాజాగా ఈ మూవీని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్‌ని పంచుకున్నారు.

ఆ పోస్టర్‌లో శర్వానంద్ డస్టీ రోడ్‌పై రేసులో బైక్ రైడ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. కాగా ఇది స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరో బైక్ రైడర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ నిన్న పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ మూవీలో శర్వానంద్‌కు జోడీగా మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటించబోతుంది.

READ MORE: శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఈ మూవీ మూడు తరాల కుటుంబానికి సంబంధించిన కథ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. 90, 20వ దశకం ప్రారంభంలో మోటోక్రాస్ రేసింగ్ ఆధారంగా కాస్త లవ్ వంటి అంశాలతో ఈ మూవీ రూపొందనుంది. ఈ మూవీకి జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×