Dhoom -4..ధూమ్ ఫ్రాంచైజీ ద్వారా జాన్ అబ్రహం (John Abraham),అమీర్ ఖాన్( Aamir Khan),హృతిక్ రోషన్(Hrithik Roshan)లు ఎంత పాపులారిటీని సంపాదించుకున్నారో చెప్పనక్కర్లేదు. ధూమ్ ఫ్రాంచైజీ బాలీవుడ్ ఇండస్ట్రీకే పేరు తెచ్చి పెట్టిన సినిమాగా చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ఈ ధూమ్ ఫ్రాంచైజీలోకి తాజాగా ఓ టాలీవుడ్ హీరో ఎంట్రీ ఇస్తున్నట్టు బాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు చాలామంది నార్త్ హీరోలు సౌత్ లోకి, సౌత్ హీరోలు నార్త్ లోకి వెళ్తున్నారు. అయితే వీరి బాటలోనే తాజాగా మరో సౌత్ హీరో కూడా ధూమ్-4 మూవీలో హీరోగా నటిస్తున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ధూమ్ ఫ్రాంచైజీకి ఎంట్రీ ఇస్తున్న ఆ సౌత్ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
ధూమ్ -4లో సౌత్ సూపర్ స్టార్..
బాలీవుడ్ లో వచ్చిన ధూమ్, ధూమ్-2 ధూమ్-3 మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్సే.అయితే చాలా రోజులుగా ధూమ్ 4 సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన ఎక్కడ కూడా వినిపించడం లేదు. దాంతో బాలీవుడ్ అభిమానులు అందరూ ధూమ్ 4 సినిమా ఇంకెప్పుడు అనే ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధూమ్ 4 ప్రాజెక్ట్ ని యాక్షన్ సినిమాలు తెరకెక్కించే అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ లోని రణబీర్ కపూర్(Ranbir kapoor), రణవీర్ సింగ్ (Ranveer Singh)ల పేర్లు తెర మీద వినిపిస్తున్నప్పటికీ.. వీరితో పాటు సౌత్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు (Mahesh Babu) పేరు కూడా వినిపిస్తోంది. అయితే మహేష్ బాబు గానీ ఈ సినిమా చేస్తే ఆ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్తుందని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
also read: Samantha: “దాచడానికి ఏం లేదు”.. సమంత సంచలన పోస్ట్..!
నిజమైతే థియేటర్ దగ్గరిల్లాల్సిందే..
అయితే మహేష్ బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో నేను బాలీవుడ్ కి వెళ్ళనని.. నాకు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయడమే ఇష్టం అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా ధూమ్ -4 లో హీరోగా మహేష్ బాబు పేరు వినిపించడంతో మహేష్ బాబు కూడా ఎన్టీఆర్ బాటలో బాలీవుడ్ కి వెళ్తున్నారని చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు మహేష్ బాబు పేరు అధికారికంగా అయితే అనౌన్స్ చేయలేదు.ఒకవేళ మహేష్ బాబు ఈ సినిమాలో చేస్తే మాత్రం కటౌట్ ఊహించుకోవడమే చాలా అద్భుతంగా ఉంది అని మహేష్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి (Rajamouli) ఎస్ఎస్ఎంబి 29 (SSMB 29) మూవీలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవడానికి మరో 2 సంవత్సరాలు పడుతుంది. అలాగే ధూమ్-4 సినిమా స్టార్ట్ అవ్వడానికి కూడా మరో 2సంవత్సరాలు పడుతుందని తెలుస్తోంది. ఈలోగా మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 పూర్తి చేసి ధూమ్-4 మూవీలో నటించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ధూమ్-4 సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారనే వార్తలు రూమర్లేనా? లేక నిజమా? అనేది ముందు ముందు తెలుస్తుంది.