Telugu audience : ప్రస్తుత కాలంలో ఆడియన్స్ థియేటర్ కి రావడం తగ్గిపోయింది అనే మాట వాస్తవం. ఒకప్పుడు కేవలం సినిమా మాత్రమే ఎంటర్టైన్మెంట్ మీడియంగా ఉండేది. ఇప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్స్ ఇంట్లో ఉన్న టీవీలో వచ్చేస్తున్నాయి. థియేటర్ కు వెళ్లి సినిమా చూసే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. కొన్ని రోజులు ఆగితే సినిమా ఓటీటీ లో చూడొచ్చు అని ఫిక్సయిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. రీసెంట్ గా ఈ మధ్యకాలంలో దర్శకుడు త్రినాధరావు నక్కిన చెప్పినట్లు ఆడియన్స్ థియేటర్ కు రావడం మానేశారు అనే మాట వాస్తవమే. చాలా చోట్ల థియేటర్స్ మూసేశారు కూడా, కొన్నిచోట్ల సెకండ్ షో స్ క్యాన్సిల్ చేస్తున్నారు. అయితే వీటన్నిటిని మించి ఒక మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా ఆడియన్స్ ధియేటర్ కి వస్తారు అని నిరూపించిన సినిమాలు కొన్ని ఉన్నాయి.
కోర్ట్
ఈ సినిమాతో రామ్ జగదీష్ అనే ఒక కొత్త దర్శకుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పెద్దపెద్ద స్టార్లు లేకపోయినా కొంతమంది తెలిసిన నటులు ఉన్నారు. అయినా కూడా ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టి కోట్లు గుమ్మరించారు. అంటే దీనికి కారణం ఇది ఒక మంచి సినిమా అని ప్రేక్షకులు అందరికీ తెలియడం వలన. ఒక గొప్ప సినిమా వచ్చినప్పుడు కచ్చితంగా ప్రాక్షకులు థియేటర్ కు వస్తారు అని నిరూపించిన సినిమాల్లో ఇది ఒకటి.
టిల్లు స్క్వేర్
సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమాను తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
బేబీ
సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కలిసి నటించిన సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య పెద్దగా ప్రేక్షకులకు తెలియకపోయినా కూడా చాలామంది ప్రేక్షకులు థియేటర్ వచ్చి సినిమాను చూశారు. ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక దేవర పుష్ప వాల్తేరు వీరయ్య వంటి సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అవి స్టార్ హీరోలు సినిమాలు కాబట్టి కచ్చితంగా ఆడియన్స్ వస్తారు అనుకుందాం. అయినా చిన్న సినిమాలకి కూడా ఆడియన్స్ వస్తున్నారు అంటే, ఒక మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి.
Also Read : Parasuram: కథ చెప్పడం పూర్తయింది, కార్తీ ఒప్పుకోవడమే లేటు