BigTV English

Mahesh Babu coments: కమిటీ కుర్రోళ్లపై మహేష్ కామెంట్స్ వైరల్..అంత మాట అనేశాడేమిటి?

Mahesh Babu coments: కమిటీ కుర్రోళ్లపై మహేష్ కామెంట్స్ వైరల్..అంత మాట అనేశాడేమిటి?

Mahesh Babu coments on Niharika Konidela latest movie Committee Kurrollu: సినిమా ఇండస్ట్రీలో డీసెంట్ హీరోలలో ఒగరుగా చెప్పుకుంటారు మహేష్ బాబు గురించి. ఎంత సేపూ తన సినిమాలు తప్ప ఎలాంటి వివాదాలలోనూ తలదూర్చడు. మీడియాకు సైతం అంటీముట్టనట్లుగా ఉంటాడు. చాలా మంది మహేష్ కు ఇగో అనుకుంటారు. కానీ షూటింగులోనూ మహేష్ ప్రవర్తన తెలిసిన వారంతా మహేష్ ఎవరి జోలికీ వెళ్లరు. తనకి ఏం కావాలో అంతవరకే మాట్లాడతాడని అంటారు. అలాగే తోటి నటుల సినిమాల గురించి కూడా చాలా తక్కువ సందర్భాలలో తన మనసులోని మాట చెబుతుంటాడు మహేష్. పైగా ఎంతో గొప్పగా ఉంటే తప్ప ఆ సినిమా గురించి చెప్పడు. ఒకవేళ మహేష్ బాబు స్పందించాడంటే ఆ సినిమా రేంజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోతుంది. గతంలో చాలా సినిమాలు నిరూపించాయి.


నిర్మాతగా తొలి చిత్రం

ఇటీవల నాగబాబు కుమార్తె, మెగా డాటర్ నిర్మాతగా మారి తొలి చిత్రంగా కమిటీ కుర్రోళ్లు నిర్మించింది. మొన్నశుక్రవారం రిలీజయింది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. ముఖ్యంగా కథ, కథనాల కన్నా టేకింగ్స్ పరంగా దర్శకుడు మంచి మార్కులే కొట్టేశాడు. గ్రామీణ నేపథ్యంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వచ్ఛంగా తీసిన కమిటీ కుర్రోళ్లు బాగానే ఆకట్టుకుంటున్నారు. ఇందులో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా కొత్తవారే కావడం విశేషం. కొత్తవాళ్లే అయినా ఎంతో అనుభవం ఉన్న వారిలా నటించారు. అయితే మహేష్ బాబు ఈ సినిమాను తాను ఇంకా చూడలేదని ఈ సినిమా సాధించిన సక్సెస్ గురించి వింటున్నానని..ఎంతో అభిరుచితో నిర్మించిన తొలి చిత్రమే అద్భుత విజయం అందుకోవడంపై నిహారిక కు కంగ్రాట్స్ తెలియజేశారు. మనం గ్రేట్ థింగ్స్ గురించి వింటూ ఉంటాం. ఇప్పుడు చూస్తున్నాం. మరిన్ని విజయాలు అందుకోవాలని నిహారికను అభినందనలతో ముంచెత్తాడు మహేష్.


మహేష్ ఫ్యాన్స్ స్పందన

తమ అభిమాన హీరో మహేష్ స్పందన చూసిన ఫ్యాన్స్ మహేష్ బాబు మెచ్చుకున్నారంటే తప్పక ఆయన అభిమానులంతా ఈ మూవీని చూస్తారని ఇలా వేరే వాళ్ల సినిమాలను ఎంకరేజ్ చేసే గుణం ఎంతమందికి ఉంటుంది. కేవలం తమ అభిమాన హీరోకి మాత్రమే ఇలాంటి గుణం ఉంటుందని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీ పచ్చగా నాలుగు కాలాలపాటు ఉండాలని అభిలషించే వ్యక్తి మహేష్ బాబు అన్నారు. తన నిర్మాత ఎప్పుడూ నష్టపోకూడదని భావించే హీరో కృష్ణకు అసలైన వారసుడు మహేష్ బాబే అంటున్నారు.

మెగా ఫ్యామిలీలో సంబరాలు

మహేష్ బాబు ట్వీట్ తో మెగా డాటర్ నిహారిక ఆనంద డోలికల్లో తేలిపోతోంది. తన సినిమాపై స్పందించినందుకు కృతజ్ణతలు తెలియజేస్తోంది. మెగా డాటర్ సాధించిన విజయంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నాగబాబు, వరుణ్ తేజ్ ల ఆనందానికి అవధులు లేవు. నిహారిక కష్టమంతా ఈ సినిమాలో కనిపిస్తోందని నాగబాబు వ్యాఖ్యానించారు. ఆమె కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దక్కుతోందని..ఇది ఎంటైర్ టీమ్ వర్క్ అని ఈ క్రెడిట్ అందరికీ దక్కుతుందని నాగబాబు కామెంట్స్ చేశఆరు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×