BigTV English

This Week Theatre And OTT Releases: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ వారం థియేటర్‌లో రచ్చ రచ్చే.. ఓటీటీలో 25కి పైగా రిలీజ్..

This Week Theatre And OTT Releases: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ వారం థియేటర్‌లో రచ్చ రచ్చే.. ఓటీటీలో 25కి పైగా రిలీజ్..

This Week Theater And OTT Releases: ప్రతి వారం మాదిరిగానే మరో వారం వచ్చేసింది. ఆగస్టు రెండో వారంలో పలు బడా సినిమాలతో పాటు చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అదీగాక ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలో సందడి వాతావరణం కనపడబోతుంది. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ నుంచి తంగలాన్ లాంటి భారీ యాక్షన్ సినిమా కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అలాగే ఓటీటీలోనూ పలు సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.


థియేటర్ చిత్రాలు

మిస్టర్‌ బచ్చన్‌


మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్టర్‌ బచ్చన్‌’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్‌ లెవెల్లో రిలీజ్ కానుంది. అయితే రవితేజ అభిమానుల కోసం ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు 14న ప్రీమియర్‌ షోలు వేయనున్నారు.

డబుల్‌ ఇస్మార్ట్

రామ్‌ పోతినేని నటిస్తున్న మాస్ యాక్షన్ సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

ఆయ్

నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఆయ్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ అంచనాలు పెంచేసింది. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుంది. అంజి కె మనిపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

తంగలాన్

Also Read: అలాంటి ఫీలింగ్స్ లేవు నాకు..అనవసరంగా రచ్చ చేయొద్దు అంటోంది మాళవిక

డిఫరెంట్ పాత్రలతో సినీ ప్రియుల్ని అలరిస్తున్న చియాన్ విక్రమ్ ఇప్పుడు మరో విభిన్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పా.రంజిత్‌ దర్శకత్వంలో ‘తంగలాన్‌’ మూవీ చేస్తున్నాడు. ఇందులో మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్ లెవెల్లో విడుదల కానుంది.

వేదా

నిఖిల్ అద్వాణీ దర్శకత్వంలో జాన్‌ అబ్రహం, శార్వరీ వాఘ్‌, తమన్నా లీడ్ రోల్స్‌లో నటించిన సినిమా ‘వేదా’. ఈ సినిమా ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఖేల్‌ ఖేల్‌ మే

ముదస్సర్‌ అజీజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఖేల్‌ ఖేల్‌ మే’. ఇందులో అక్షయ్‌ కుమార్‌, తాప్సి, వాణీకపూర్‌, అమ్మీ వ్రిక్‌, ఆదిత్య సీల్‌, ఫర్దీన్‌ఖాన్‌, ప్రజ్ఞా జైశ్వాల్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీలో చిత్రాలు/సిరీస్‌లు

డిస్నీ+హాట్‌స్టార్‌

ఆగస్టు 13 – డార్లింగ్‌ (తెలుగు)
ఆగస్టు 14 – ది టైరాంట్‌ (కొరియన్‌)
ఆగస్టు 14 – స్టార్ వార్స్ : యంగ్ జేడీ అడ్వెంచర్స్ సీజన్ 2
ఆగస్టు 16 – మై ఫర్‌ఫెక్ట్ హస్బెండ్

నెట్‌ఫ్లిక్స్‌

ఆగస్టు 14 – వరస్ట్‌ ఎక్స్‌ ఎవర్‌ (సిరీస్)
ఆగస్టు 14 – డాటర్స్‌ (డాక్యుమెంటరీ సిరీస్)
ఆగస్టు 14 – ఎమిలీ ఇన్‌‌పారిస్‌ (సిరీస్‌)
ఆగస్టు 14 – రెన్‌ఫీల్డ్ (హాలీవుడ్)
ఆగస్టు 15 – యావరేజ్ జో సీజన్ 1
ఆగస్టు 15 – బ్యాక్‌ యార్ట్ వైల్డర్‌నెస్
ఆగస్టు 15 – ఎమిలీ ఇన్‌ పారిస్‌సీజన్‌4- పార్ట్ 1
ఆగస్టు 16 – కెంగన్‌ అసుర సీజన్‌ 2- పార్ట్‌ 2
ఆగస్టు 16 – ది యూనియన్‌(హాలీవుడ్‌)
ఆగస్టు 16 – పెరల్
ఆగస్టు 16 – ఐ కెనాట్ లైవ్‌ వితౌట్ యూ
ఆగస్టు 17 -లవ్‌ నెక్స్ట్ డోర్‌ (కొరియన్‌)
ఆగస్టు 17 – షాజమ్ ఫ్యూరీ ఆఫ్‌ గాడ్స్‌
ఆగస్టు 17 – ది గార్‌ఫీల్డ్‌ మూవీ(యానిమేషన్‌ సినిమా)

Also Read: జాక్వెలిన్ పేరుతో ఓ షిప్ కానుకగా ఇస్తానంటున్న సుఖేశ్

జియో సినిమా

ఆగస్టు 12 – ఇండస్ట్రీ సీజన్3 (సిరీస్)
ఆగస్టు 14 – శేఖర్‌ హోమ్‌ (బెంగాలీ సిరీస్)
ఆగస్టు 15 – బెల్ ఎయిర్ సీజన్ 2

జీ5

ఆగస్టు 15 – మనోరథంగల్‌ (తమిళ సిరీస్) ఆగస్టు 15
ఆగస్టు 15 – కాంటాయే కంటాయే (హిందీ సిరీస్)

అమెజాన్‌ ప్రైమ్‌

ఆగస్టు 14 – నామ్‌ నమక్‌ నిషాన్‌ (హిందీ)
ఆగస్టు 15 – జాక్‌ పాట్‌(హాలీవుడ్‌)

ఆహా

ఆగస్టు 15 – వీరమారి ఆఫీస్‌2(సిరీస్‌)

సోనీలివ్‌

ఆగస్టు 16 – చమక్‌ (హిందీసిరీస్‌)

ఈటీవీ విన్‌

ఆగస్టు 14 – వీరాంజనేయులు విహారయాత్ర(తెలుగు)

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×