Vaishnavi Chaitanya: మామూలుగా ఒక హీరోతో కలిసి నటిస్తున్నప్పుడు వారిపై ప్రశంసలు కురిపించడం హీరోయిన్స్‌కు అలవాటే. హీరోయిన్స్ యాక్టింగ్ నచ్చితే హీరోలు కూడా అదే పనిచేస్తారు. ఇక టాలీవుడ్ ప్రస్తుతం ఉన్న తెలుగుమ్మాయిల్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య. సాయి రాజేశ్ దర్శకత్వంలో తెరకెకక్కిన ‘బేబి’ సినిమా వైష్ణవి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా వల్ల తనకు విపరీతమైన పాపులారిటీ దక్కడంతో పాటు వరుసగా అవకాశాలు కూడా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే హీరోయిన్‌గా తను నటించిన పలు సినిమాలు విడుదల కాగా.. త్వరలోనే సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించిన మూవీ కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
హీరోపై ప్రశంసలు
ఇప్పటికే పలువురు యంగ్ హీరోలతో జోడీకడుతూ తన యాక్టింగ్‌తో మంచి మార్కులు కొట్టేసింది వైష్ణవి చైతన్య. యూట్యూబ్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చి సక్సెస్ అయిన నటీనటులు ఎంతోమంది ఉన్నారు. కానీ వారు ఆ సక్సెస్‌ను ఎక్కువకాలం కొనసాగించలేకపోయారు. తన విషయంలో అలా జరగకూడదని ‘బేబి’ విడుదలయిన తర్వాత తన వరకు వచ్చిన ఆఫర్లను కాదనకుండా యాక్సెప్ట్ చేసింది వైష్ణవి. తను నటించిన హిట్ అయినా.. ఫ్లాప్ అయినా తన యాక్టింగ్ మాత్రం క్యూట్ అని ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. దీంతో ప్రస్తుతం తనకు యూత్‌లో చాలానే ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ‘జాక్’ అనే మూవీలో నటిస్తున్న వైష్ణవి.. తాజాగా ఈ హీరోపై ప్రశంసలు కురిపించింది.
ఫ్యాన్స్‌తో ముచ్చట్లు
సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కూడా వైష్ణవి చైతన్యలాగానే ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు. తనలాగే ఒక్క సినిమాతో స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. అలాంటి ఈ ఇద్దరు నటీనటులు ‘జాక్’ అనే మూవీ కోసం స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ లేకపోయినా హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య ఫిక్స్ అయ్యిందని మొదట్లోనే ప్రకటించేశారు మేకర్స్. ఇక తాజాగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ముచ్చటించిన వైష్ణవి.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చింది. ‘సిద్ధు గారితో కలిసి నటించడం ఎలా ఉంది?’ అనే ప్రశ్నకు వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) సమాధానమిచ్చింది.
Also Read: సినిమాటిక్ యూనివర్స్ కోసం మాస్టర్ ప్లాన్.. రణవీర్ వద్దన్నాడని ప్రశాంత్ అలాంటి నిర్ణయం..
ఎంతో ఫన్
‘వర్సటైల్ యాక్టర్‌తో నటించడం చాలా గొప్పగా అనిపిస్తోంది. తను ఆల్ రౌండర్. తన చుట్టూ ఉండడం చాలా ఫన్‌గా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే తను స్టార్ బాయ్ సిద్ధు’ అని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య.‘డీజే టిల్లు’లో ఒక్క పక్కా తెలంగాణ అబ్బాయిగా నటించి మెప్పించాడు సిద్ధు. ‘బేబి’ సినిమాలో వైష్ణవి కూడా బస్తీలో పెరిగిన ఒక తెలుగమ్మాయిగానే కనిపించింది. ఇక వీరిద్దరూ కలిసి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జాక్’ (Jack) సినిమాలో ఎలా అలరిస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల ఖరారు చేసుకుంది.