OTT Movie : ఓటిటిలో లెక్కలేనన్ని సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఎక్కువగా హర్రర్, రొమాంటిక్, సస్పెన్స్ జానర్ లోని సినిమాలే కనిపిస్తాయి. యాక్షన్ తో నిండిన మంచి ఫీల్ గుడ్ సినిమాలను చూడాలంటే అవి వెతకడానికే చాలా టైం పడుతుంది. ఇలాంటి సినిమాల కోసం వెతుకుతున్న వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు, భార్యను కాపాడుకోవడానికి ఓ భర్త చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ యాక్షన్ మూవీ పేరు ‘ది నెక్స్ట్ త్రీ డేస్’ (The Next Three Days). ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మూవీని హ్యాపీగా తెలుగులో కూడా చూడొచ్చు. నిజానికి ఇదొక హాలీవుడ్ మూవీ అయినప్పటికీ, ఇందులో ఉన్న ఎమోషన్స్ ప్రేక్షకులను కదిలిస్తాయి. అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా అని బోర్ కొట్టించే సీన్స్ కాకుండా, యాక్షన్స్ సీన్స్ కూడా కావాల్సినన్ని ఉంటాయి. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో రసల్ క్రోవే, ఎలిజిబెత్ బ్యాంక్స్, బ్రియాన్ డెన్ని ప్రధాన పాత్రలు పోషించారు.
స్టోరీ లోకి వెళ్తే…
హీరో తన భార్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంటాడు. అంతా హ్యాపీగా ఉంది అనుకునే లోపే సడన్ గా హీరో ఇంట్లోకి పోలీసులు ప్రవేశిస్తారు. అసలేం జరుగుతుందో ఊహించే లోపే హీరోయిన్ ని అరెస్ట్ చేస్తారు. హీరో అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అతని మాట వినకుండా ఆయన భార్యని పట్టుకెళ్ళిపోతారు. విషయం ఏంటంటే ఆయన భార్య ఓ మర్డర్ కేసులో అనుమానితురాలు అని తీసుకెళ్తారు. అక్కడినుంచి అటే ఆమెను జైలుకు పంపిస్తారు. అసలు హీరోకి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత ప్రొఫెసర్ గా ఉండే ఈ హీరో తన భార్యను ఎలాగైనా సరే ఆ చెర నుంచి విడిపించాలని ప్లాన్ చేస్తాడు. అలాగే భార్య అరెస్టుతో చెల్లా చెదురైన తన ఫ్యామిలీ మళ్ళీ ఒక్క చోటుకి చేర్చాలని ఆయన ప్రయత్నిస్తాడు. ఈ మేరకు హీరో షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. భార్యను జైలు నుంచి బయట తేవడానికి హీరో చేసిన ప్రయత్నం ఏంటి? అసలు ఆయన ప్లాన్ ఏంటి? హీరోయిన్ ని అసలు సంబంధం లేని కేసులో ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ కేసులో ఎవరి హస్తముంది? అనే విషయాలు తెలియాలంటే, ‘ది నెక్స్ట్ త్రీ డేస్’ (The Next Three Days) మూవీని తెరపై చూడాల్సిందే. అయితే అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి ఉండే సినిమాలు చాలా అరుదు అని చెప్పాలి. అలాంటి సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు.