Best Tarzan Movies on OTT : అడవి ఎంత అందంగా ఉంటుందో, జంగిల్ బుక్ సినిమా చూస్తే అదే అడివి మరింత అందంగా కనిపిస్తుంది. టార్జాన్ పాత్రతో వచ్చిన ఈ జంగిల్ బుక్ లాంటి సినిమాలను మర్చిపోవడం అంత సులభం కాదు. ఒకప్పుడు దూరదర్శన్ లో వచ్చే యానిమేటెడ్ ‘జంగిల్ బుక్’ ను, చిన్నపిల్లలతో సహా పెద్ద వాళ్లు కూడా చూసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. అటువంటి అడవి నేపథ్యంలో సాగే, టార్జాన్ పాత్రలో వచ్చిన బెస్ట్ సినిమాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
జార్జ్ ఆఫ్ ది జంగిల్ (George OF the Jungle)
1997లో వచ్చిన ఈ అమెరికన్ కామెడీ అడ్వెంచర్ మూవీకి సామ్ వీస్మాన్ దర్శకత్వం వహించారు. బ్రెండన్ ఫ్రేజర్, లెస్లీ మాన్, థామస్ హాడెన్ చర్చ్, హాలండ్ టేలర్, రిచర్డ్ రౌండ్‌ట్రీ, జాన్ క్లీస్ ఇందులో నటించారు. ఈ మూవీ అడవి జంతువులచే పెరిగిన ఒక యువకుడి చట్టూ తిరుగుతుంది. ఈ మూవీని వాల్ట్ డిస్నీ పిక్చర్స్ నిర్మించి, జూలై 16, 1997న యునైటెడ్ స్టేట్స్, కెనడా అంతటా థియేటర్‌లలో విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా $174 మిలియన్ లు వసూలు చేసింది. దీనికి సీక్వెల్ జార్జ్ ఆఫ్ ది జంగిల్ 2 అక్టోబర్ 21, 2003న విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్ని +హాట్స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ది జంగిల్ బుక్ (The Jungle book)
2016లో విడుదలైన ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీకి జోన్ ఫావ్‌రూ దర్శకత్వం వహించారు. దీనిని జస్టిన్ మార్క్స్ రచించగా, వాల్ట్ డిస్నీ పిక్చర్స్ నిర్మించింది . ఇది రుడ్యార్డ్ కిప్లింగ్ కథ ది జంగిల్ బుక్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో నీల్ సేథీ మోగ్లీగా నటించాడు. మోగ్లీని జంతువులు రక్షిస్తూ ఉంటాయి. అడవి రాజు అయిన షేర్ ఖాన్ నుంచి తప్పించుకుంటూ ఇతని ప్రయాణం మొదలు పెడతాడు. ఈ మూవీలో బిల్ ముర్రే, బెన్ కింగ్స్లీ, ఇద్రిస్ ఎల్బా, లుపిటా న్యోంగో, స్కార్లెట్ జాన్సన్, జియాన్‌కార్లో ఎస్పోసిటో, క్రిస్టోఫర్ వాల్కెన్ వాయిస్, మోషన్ క్యాప్చర్ ప్రదర్శనలు ఇచ్చారు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తిగా లాస్ ఏంజిల్స్‌లో జరిగింది. ఈ మూవీకి ఇతర జంతువులు, సెట్టింగ్‌లను చిత్రీకరించడానికి కంప్యూటర్‌లో రూపొందించిన చిత్రాలను విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ది లెజెండ్ ఆఫ్ టార్జాన్ (The Legend of Tarjan)
2016 రిలీజ్ అయిన ఈ మూవీకి డేవిడ్ యేట్స్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్, శామ్యూల్ ఎల్. జాక్సన్, మార్గోట్ రాబీ, జిమోన్ హౌన్సౌ, జిమ్ బ్రాడ్‌బెంట్, క్రిస్టోఫ్ వాల్ట్జ్ నటించారు. ఈ కథ జాన్ క్లేటన్‌ను చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ జూన్ 29, 2016న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ప్రదర్శించబడింది. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ద్వారా 2D, 3D, IMAXలో జూలై 1, 2016న యునైటెడ్ స్టేట్స్‌లో థియేటర్‌లలో విడుదలైంది. ఇది $180 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా $356 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.