SSMB 29 Update :మహేష్ బాబు (Maheshbabu), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29(SSMB 29) సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోంది ? ఎప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది ? అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఏ తరహాలో సినిమాను తెరకెక్కిస్తున్నారు? ఇలా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమాపై గూస్ బంప్స్ తెప్పించేలా ఒక న్యూస్ తెగ వైరల్ గా మారుతోంది. తాజాగా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మూడు భాగాలుగా రాబోతుందని సమాచారం.
మూడు భాగాలుగా ఎస్ఎస్ఎంబి 29 మూవీ..
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా రూపుదిద్దుకుంటున్న ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా మూడు భాగాలుగా రాబోతోందని ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా డివోషనల్ టచ్ ఎక్కువగా ఉండబోతుందని సమాచారం. ఆఫ్రికా – ఇండియా మధ్య ఉన్న లింక్ ను అనుసంధానం చేస్తూ.. అలాగే అన్ని దేశాలను కలుపుతూ ఈ సినిమాని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారగా.. ఇప్పుడు మళ్ళీ మూడు భాగాలుగా రాబోతుందని తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయం తెలిసి మహేష్ బాబు అభిమానులు కొంతమంది మూడు భాగాలు అంటే మరో 8, 9 సంవత్సరాలు మహేష్ బాబు నుండి ఇంకో సినిమా రాదా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేష్ బాబు కెరియర్..
సూపర్ స్టార్ మహేష్ బాబు గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు. తన సినిమాలను తెలుగులోనే విడుదల చేస్తూ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న తొలిసారి పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఇటీవల రాజమౌళి కూడా ఒక వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో సింహాన్ని బోనులో లాక్ చేసి మహేష్ బాబు పాస్పోర్ట్ లాగేసుకున్నట్లు తెలిపారు. ఇక దీనికి మహేష్ బాబు కూడా.. ‘ ఒకసారి కమిట్ అయితే, నా మాట నేనే వినను ‘ అని కామెంట్ చేశారు. ఇక ప్రియాంక చోప్రా కూడా ‘ ఫైనల్లీ ‘ అంటూ కామెంట్ పెట్టింది. ఇలా మొత్తానికైతే ఈ ముగ్గురు కూడా ఈ సినిమా కోసం చాలా సంవత్సరాలు కేటాయించబోతున్నారని చెప్పవచ్చు.
ఎస్ఎస్ఎంబి 29 కోసం మాస్టర్ ప్లాన్..
ఈ సినిమా నుండి ఎలాంటి లీకులు జరగకుండా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. అందులో భాగంగానే మహేష్ బాబును మొదలుకొని ఈ సినిమా కోసం పనిచేసే చిన్న చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వరకు ఎవరు కూడా మొబైల్ ఫోన్ వాడకూడదని ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ బయటకు విడుదల చేయకూడదని షరతులతో కూడిన కండీషన్స్ పెట్టారు. మరి ఇంత పగడ్బందీగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి