iPhone 16 : టెక్ దిగ్గజం యాపిల్ గత ఏడాది ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేసిన ఐఫోన్ 16 మెుబైల్ పై అదిరే ఆఫర్స్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ మెుబైల్ ను కొనుగోలు చేసే యూజర్స్ వేలల్లో డిస్కౌంట్ పొందే ఛాన్స్ ఉంది.
ఐఫోన్ 16ను కొనుగోలు చేయాలనుకునే యూజర్స్ కు ఇదే బెస్ట్ టైమ్. తాజాగా విజయ్ సేల్స్ ఐఫోన్ 16 పై రూ. 12,000 తగ్గింపును అందిస్తోంది. ఇప్పటి వరకూ ఐఫోన్ 16పై ఇంత భారీ డిస్కౌంట్ ను ఏ ఈ కామర్స్ సంస్థ అందించలేదు. ఇక ఐఫోన్ 16 ఇండియాలో రూ.79,900కే లాంఛ్ అయింది. విజయ్ సేల్స్ ప్రస్తుతం రూ.8,000 తగ్గింపును అందిస్తోంది. ధరను రూ.71,900కు తగ్గించింది. ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్ లేదా SBI క్రెడిట్ కార్డ్‌లతో చెల్లింపులు చేసిన యూజర్స్ కు అదనంగా రూ. 4,000 తగ్గింపును అందిస్తుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో ఈ మెుబైల్ ను కొనాలనుకునే యూజర్స్ కు మరిన్ని బెనిఫిట్స్ అందిస్తుంది. పాత మెుబైల్ మోడల్, పనితీరు ఆధారంగా బెస్ట్ ధరను నిర్ణయించి మరింత తక్కవ ధరకే ఈ మెుబైల్ ను కొనుగోలు చేసే ఛాన్స్ అందిస్తుంది.
ఐఫోన్ 16 ఫీచర్లు –
యాపిల్ ఐఫోన్ 16 అదిరే లేటెస్ట్ ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చేసింది. ఈ మెుబైల్ లో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఇది 2,000 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ కలిగి ఉంది. సిరామిక్ షీల్డ్ గ్లాస్ కోటింగ్, డిస్ ప్లే HDR కు సపోర్ట్ చేస్తుంది.
ఐఫోన్ 16 యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు మద్దతు ఇవ్వడానికి 3nm A18 బయోనిక్ చిప్ తో పనిచేస్తుంది. ఈ గ్యాడ్జెట్ 22 గంటల ప్లేబ్యాక్ సదుపాయంతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఐఫోన్ 16 IP68 సర్టిఫికేట్ సైతం పొందింది. ఫోటోగ్రఫీ కోసం, iPhone 16లో 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP ఫ్యూజన్ సెన్సార్, 12MP మాక్రో లెన్స్, 12MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉన్నాయి. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందించడానికి లాజిక్ బోర్డ్‌తో వచ్చేస్తుంది. హార్డ్‌వేర్ సిస్టమ్, రే ట్రేసింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
యాపిల్ కంపెనీ త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్ ను లాంఛ్ చేయనున్న నేపథ్యంలో ఐఫోన్ 16 మొబైల్ పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ భారీ డిస్కౌంట్ ను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఈ మొబైల్ పై ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఫ్లాట్ఫామ్స్ లో దిమ్మతిరిగే డిస్కౌంట్స్ ఉండగా.. ఇప్పుడు తాజాగా మరిన్ని ప్లాట్ఫామ్స్ ఇదే ఫాలో అయిపోతున్నాయి.
టెక్ దిగ్గజం యాపిల్ ప్రపంచవ్యాప్తంగా తనకున్న డిమాండ్ ను ఆధారంగా చేసుకుని ఎన్నో లేటెస్ట్ గాడ్జెట్స్ ను తీసుకురావడానికి సిద్ధమవుతుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది సైతం మరిన్ని గ్యాడ్జెట్స్ త్వరలోనే రాబోతున్నాయి. ఇప్పటికే 20 గ్యాడ్జెట్స్ లాంఛ్ చేస్తామని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. వీటిలో ఐఫోన్ 17 సిరీస్ తో పాటు ఐఫోన్ SE4 మొబైల్, హోమ్ అప్లికేషన్స్, స్మార్ట్ కెమెరా, స్మార్ట్ టీవీ, స్మార్ట్ గ్లాసెస్ వంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఎన్నో ఉన్నాయి.
ALSO READ : శామ్సంగ్ గెలాక్సీ S25 వచ్చేసిందోచ్! ఫస్ట్ ఆర్డర్ పై ఆఫర్సే ఆఫర్స్