Anupama Parameswaran: హీరో అయినా హీరోయిన్ అయినా ఒకేలాంటి పాత్రలు చేస్తూ ఉంటే కొన్నాళ్లకు ఆడియన్స్‌కు బోర్ కొట్టేస్తుంది. అందుకే నటీనటులుగా ఎప్పటికప్పుడు వారిలో కూడా మార్పు రావాలని అనుకుంటారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అలా వారు చేసే ప్రతీ ప్రయోగం సక్సెస్ అవ్వకపోయినా కొత్తగా ప్రయత్నించామనే తృప్తి ఉంటుందని ఇప్పటికే ఎంతోమంది నటీనటులు బయటపెట్టారు. అలాగే గత కొన్నేళ్లలో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ స్టోరీ సెలక్షన్ కూడా చాలా మారింది. మరోసారి తన టాలెంట్ ఏంటో నిరూపించుకోవడానికి సిద్ధమయ్యింది. తాజాగా తన అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయ్యింది.
మాట నిలబెట్టుకుంది
కెరీర్ మొదట్లో చాలావరకు పక్కింటమ్మాయి పాత్రల్లోనే నటించింది అనుపమ పరమేశ్వరన్. తను ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో నటించకపోయినా.. దాదాపు తను నటించిన ప్రతీ పాత్ర ఒకేలాగా అనిపించేది. అందుకే తన స్టైల్, స్టోరీ సెలక్షన్ అన్నీ మారాలని అనుపమ డిసైడ్ అయ్యింది. ఆ క్రమంలోనే ముందుగా సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ‘టిల్లు స్క్వేర్’ చేసింది. దీంతో అనుపమ కూడా గ్లామర్ షో, లిప్ లాక్ చేయడానికి ఓకే చెప్పేసిందని తన ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. అయితే తను ఇప్పటినుండి కాస్త డిఫరెంట్ సినిమాలు, పాత్రలు చేస్తానని మాటిచ్చింది అనుపమ. అనుకున్నట్టుగానే తన మాట నిలబెట్టుకుందని తన అప్‌కమింగ్ మూవీ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది.
Also Read: పెళ్ళైన తగ్గేదేలే.. ఇంత కమర్షియల్ అయ్యిందేంటి..?
నిజమైన సంఘటన
నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే సినిమాలో నటిస్తోంది అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ అయ్యింది. ఇందులో అనుపమ ప్రెగ్నెంట్‌గా కోర్టులో కూర్చొని ఉంది. ఇక ఈ కేసును వాదించే లాయర్ పాత్రలో మలయాళ సీనియర్ స్టార్ హీరో సురేశ్ గోపీ (Suresh Gopi) కనిపించనున్నారు. ప్రవీణ్ నారాయణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. బైజు సంతోష్, మాధవ్ సురేశ్ గోపీ, దివ్య పిల్లై, అస్కర్ అలీ లాంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ చూస్తుంటేనే ఇదొక కొర్ట్ రూమ్ డ్రామా అని అర్థమవుతోంది.
అమ్మాయికి జరిగిన అన్యాయం
ఫిబ్రవరీలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki Vs State Of Kerala) మూవీ రిలీజ్ కానుంది. జానకి అనే అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి కోర్టులో ఎలా నిలబడింది అనేదే సినిమా కథ అని మేకర్స్ చెప్తున్నారు. ఇక సురేశ్ గోపీ ఈ కేసును వాదించే డిఫెన్స్ లాయర్‌గా కనిపించనున్నారు. ‘టిల్లు స్క్వేర్’ సినిమా రిలీజ్ టైమ్‌లో తనలో ఇంత మార్పేంటి అని అనుపమను అడగగా.. రోజూ బిర్యానీనే తింటే బోర్ కొడుతుంది కదా అంటూ తను ఇచ్చిన స్టేట్‌మెంట్ చాలా వైరల్ అయ్యింది. ఇప్పుడు నిజంగానే తను చెప్పినట్టుగా రోజూ బిర్యానీ తినకుండా వెరైటీ ఐటెమ్స్ అన్నీ ట్రై చేస్తోంది అనుపమ పరమేశ్వరన్.