BigTV English

Mahesh Babu Voice in Phone Pe Speaker: ఇకపై ప్రతి షాప్‌లో మహేశ్ బాబు వాయిస్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్!

Mahesh Babu Voice in Phone Pe Speaker: ఇకపై ప్రతి షాప్‌లో మహేశ్ బాబు వాయిస్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్!

Mahesh Babu’s Voice in Phone Pe Speakers: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన మూవీ ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఫస్ట్ షో నుంచే ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ అందుకొని పర్వాలేదనిపించుకుంది.


ఇక ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఎస్ఎస్ఎంబీ 29’ వర్కింగ్ టైటిల్‌‌తో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందబోతుంది. ఇందులో నటీనటుల కోసం రాజమౌళి హాలీవుడ్ నుంచి స్టార్‌లను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మహేశ్ బాబు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఆయన ఓ సంస్థతో భాగస్వామి అయ్యి.. తన వాయిస్‌ను అందించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దీంతో ఆ సంస్థకు వాయిస్ అందించిన ఏకైక నటుడిగా మహేశ్ బాబు నిలిచారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే మరి ఇంతకీ మహేశ్ బాబు ఏ సంస్థకి తన వాయిస్ అందించారు అనే విషయానికొస్తే..


READ MORE: ‘జై హనుమాన్’లో చిరంజీవి, మహేశ్ బాబు.. దర్శకుడి ప్లాన్ మామూలుగా లేదు..!

ప్రముఖ డిజిటల్ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ ‘ఫోన్‌పే’తో మహేశ్ బాబు భాగస్వామి అయ్యారు. ఇందులో భాగంగానే ఆయన తన వాయిస్‌ను ఆ సంస్థకు అందించారు. దీంతో ఇకనుంచి ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో చెల్లింపుల వివారాలు మహేశ్ బాబు వాయిస్‌తో వస్తాయి. కాగా ఆల్రెడీ మహేశ్ వాయితో వినిపిస్తున్న కొన్ని వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇకపోతే గతంలో ఈ డిజిటల్ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ ఫోన్‌పే కోసం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన తర్వాత ఫోన్‌పేకి వాయిస్ ఇచ్చిన ఏకైక నటుడిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నిలిచారు.

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×