Hero Ajith :ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) పలుమార్లు గాయాల పాలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నోసార్లు ఆయన యాక్సిడెంట్ కి గురయ్యారు కూడా.. అయితే ఆ ప్రమాదాలన్నింటినీ కూడా దాటుకొని ఆరోగ్యంగా బయటపడగా.. ఇప్పుడు మాత్రం ఏకంగా హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. మరి పద్మభూషణ్ గ్రహీతకు గాయాలు ఎలా అయ్యాయి? ఆయన హాస్పిటల్లో ఎప్పుడు చేరారు? ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రముఖ నటుడు అజిత్ చెన్నైలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన కాలికి చిన్న గాయమైందని, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపినట్లు నటుడి టీం స్పష్టం చేసింది.
అజిత్ కోసం అభిమానుల తోపులాట.. హీరోకి గాయాలు..
అసలు విషయంలోకి వెళ్తే.. పద్మభూషణ్ అవార్డు స్వీకరణ తర్వాత అజిత్ తన కుటుంబంతో కలిసి ఢిల్లీ నుంచి చెన్నై ఎయిర్ పోర్ట్ కి మంగళవారం రాత్రి చేరుకున్నారు. ఆ సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు ఆయన వైపు దూసుకు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆ ఘటనలోనే అజిత్ కాలికి స్వల్ప గాయం అయినట్టు టీమ్ వివరించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన టీం వెల్లడించింది. మొత్తానికైతే అభిమానుల తోపులాటే కారణం అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అజిత్ ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ALSO READ:Killer Glimps: కిల్లర్ గ్లింప్స్ రిలీజ్.. అదరగొట్టేసిన జగతి.. ఇంత వయలెన్స్ ఏంటి గురూ..?
అజిత్ కెరియర్..
అజిత్ సినిమాల విషయానికి వస్తే.. విడాముయార్చి సినిమాతో ఏడాది ప్రేక్షకులను అలరించిన ఈయన, ఆ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నారు. అజిత్ కుమార్ తెలంగాణలోని సికింద్రాబాద్లో జన్మించారు. తన నటన జీవితాన్ని తెలుగు చిత్రమైన ‘ప్రేమ పుస్తకం’తో ప్రారంభించిన ఈయన బహుభాషా కోవిదుడు. చదివింది పదవ తరగతి వరకే అయినా..తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఆంగ్ల భాషలను అనర్గళంగా మాట్లాడగల కెపాసిటీ ఆయన సొంతం ఇక తెలుగులో పలు చిత్రాలు చేసి కోలీవుడ్ కి వెళ్లిపోయిన ఈయన అక్కడే చెన్నైలో సెటిలైపోయారు. ఇకపోతే ఈయన కెరియర్ కు ప్రముఖ హీరోయిన్ హీరా కోసంఎంతో కష్టపడిందని పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉంటారు ముఖ్యంగా అజిత్ కి అవకాశాలు రావడంలో హీరా ఎంతో సహాయం చేసిందట. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారని పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక 2000 సంవత్సరంలో ప్రముఖ హీరోయిన్ బేబీ షాలిని వివాహం చేసుకున్నారు అజిత్.
ALSO READ:MM. Keeravani : సింగర్ ప్రవస్తికి జరిగింది అన్యాయమే… ఎట్టకేలకు కీరవాణి ఓపెన్..?