Namrata: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా జంటగా నటించిన చిత్రం పోకిరి. ఈ సినిమాలో ప్రతి డైలాగు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుంటాయి.. ఈ సినిమాలో మహేష్ బాబు నటన, ఇలియానా అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రిలీజ్ అయ్యి 19 సంవత్సరాలైనా ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లోనే అత్యుత్తమమైన సినిమా ఏదైనా ఉందంటే అది పోకిరినే. వెండితెరపై పండుగాడిగా మహేష్ బాబు నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ చిత్రం టీవీలలో ప్రసారమైతే ప్రేక్షకులు ఇప్పటికీ కన్నార్పకుండా చూస్తున్నారు. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ గురించి ఆయన సతీమణి నమ్రత చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఆ పోస్టులో ఏముందో చూసేద్దాం..
పండు గాడు ఎప్పటికి ముసలోడు అవ్వడు ..
తెలుగు సినీ పరిశ్రమలో ఈ మూవీ కి ముందు మహేష్ బాబును ప్రిన్స్ అని పిలిచేవారు. ఈ చిత్రం విడుదలైన తరువాత ఆయనను సూపర్ స్టార్ గా పిలవడం మొదలుపెట్టారు అభిమానులు. మహేష్ ని ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా మార్చిన చిత్రం పోకిరి. మహేష్ డైలాగ్ డెలివరీ, యాక్షన్స్, ఆయన స్టైల్ యువతను బాగా ఆకర్షించాయి. ఈ మూవీ లో మహేష్ పండుగాడి క్యారెక్టర్ లో, అండర్ కవర్ పోలీస్ గా, ఆయన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంటుంది. వయసు పెరుగుతున్న, ఇప్పటికీ యంగ్ గా కనిపించే హీరోలలో మహేష్ ఒకరు. ఇది మహేష్ ఫ్యాన్స్ చెప్పే మాట కాదు, ఆయనను చూసిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇదే. ఇప్పుడు ఇదే మాటను ఆయన సతీమణి కూడా అంటున్నారు. తాజాగా ఆయన సతీమణి నమ్రత తన ఇంస్టాగ్రామ్ లో పండుగాడు ఎప్పటికీ ఓల్డ్ కాదు అని ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. పండుగాడు ఎప్పటికీ ముసలోడు కాదు అని మీరు చెప్పిన మాట నిజమేనండోయ్ అంటూ మహేష్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
సినిమా రికార్డ్స్ ..
2006లో పోకిరి మూవీ మన ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ చిత్రం భారీ వసూలు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అప్పట్లోనే 40 కోట్లకు పైగా షేర్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దాదాపు 50 రోజులు 2009 సెంటర్లలో, వంద రోజులు 200 సెంటర్స్ లో నిర్విరామంగా ఆడిన రికార్డును నెలకొల్పింది పోకిరి చిత్రం. ఇక ఈ మూవీ కర్నూల్ లోని ఓ థియేటర్లో రోజుకు నాలుగు ఆటలతో 500 రోజులు నిర్విరామంగా ఆడిన ఘనతను దక్కించుకుంది.ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు. సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్ ఆల్బమ్ గా నిలిచింది. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే 25 ఏళ్లలో మొదటి రికార్డు. ఇలాంటి రికార్డ్స్ పోకిరి సినిమాకు చాలానే ఉన్నాయి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రంలో నటిస్తున్నారు.
Nani: నాని ప్యారడైజ్‌లో బాలీవుడ్ విలన్… ఇక సినిమా మొత్తం రక్తపాతమే