Devaki Nandana Vasudeva : కాసేపటి క్రితం దేవకీ నందన వాసుదేవ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టోరీ కాబట్టి… ఆ పరంగా చూస్తే సినిమాపై బజ్ అయితే ఉంది. కానీ, హీరో అశోక్ గల్లా మైనస్ అయ్యేలా ఉన్నాడు అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. యాక్షన్ సీన్స్ టైంలో హీరో సెట్ అవ్వలేదు అంటూ అప్పుడే టాక్ అయితే బయటికి వచ్చింది. ఇదంత పక్కన పెడితే, ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత నమ్రత ఫైర్ అవ్వడంతో మహేష్ బాబును ఇన్వాల్ చేయడం లేదని టాక్ వచ్చింది.
అయితే మహేష్ బాబుతో చేయించాలి అని అనుకున్న పాత్రతో మేకర్స్ క్లైమాక్స్‌లో ఓ భారీ ట్విస్ట్ ప్లాన్ చేశారట. అదేంటో ఇప్పుడు చూద్ధాం…
ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా చేస్తున్న మూవీ దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమాకు భారీ హైప్ ఉంది. నిజానికి అశోక్ గల్లా మూవీకి ఇంత హైప్ ఉండటం ఆశ్చర్యమే. కానీ, హనుమాన్‌తో ఒకసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు స్టోరీని అందించాడు. నిజానికి ఈ సినిమాను ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేయాల్సింది. అందుకోసమే దాదాపు రెండేళ్ల పాటు కష్టపడి ఈ స్టోరీని ప్రిపేర్ చేసుకున్నాడు. కానీ, ప్రశాంత్ వర్మ తన యూనివర్స్ పై ఫోకస్ చేయడంతో వేరే డైరెక్టర్‌తో ఈ సినిమాను డైరెక్ట్ చేయిస్తున్నాడు. గుణ 369 అనే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ జంధ్యాల చేతిలో ఈ స్టోరీని పెట్టాడు ప్రశాంత్ వర్మ.
కృష్ణ పాత్రలో మహేష్ బాబు…
తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సినిమాలో ఓ భారీ శ్రీ కృష్ణుడి విగ్రహం కనిపించింది. ఈ విగ్రహం చేతిలో సుదర్శన చక్రం కూడా ఉంది. ఇది ట్రైలర్‌కి హైలైట్‌గా కనిపిస్తుంది. సినిమా మొత్తం కృష్ణ గురించే ఉంటుందని తెలుస్తుంది. మేనల్లుడు చేతిలోనే మేనమామ చనిపోవడం అనే కాన్సెప్ట్ తో సినిమా ఉంది. ఇది కృష్ణుడి కథ ఆధారంగానే తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఎంతో ఇంపార్టెన్స్ ఉండే కృష్ణ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించేలా ప్లాన్ చేశారట మేకర్స్. సీజీ సాయంతో మహేష్ బాబును కృష్ణుడిలా క్రియేట్ చేశారట. ఆ ఫోటోలు కొద్ది రోజుల క్రితం లీక్ అయ్యాయి.
నమ్రత సీరియస్..?
దేవకీ నందన వాసుదేవలో కృష్ణ పాత్రలో మహేష్ బాబు చూపించినట్టు టాక్ రావడం, ఫోటోలు లీక్ అవ్వడంతో నమ్రత సీరియస్ అయ్యారని టాక్. దీంతో కృష్ణ పాత్రలో మహేష్ బాబు రాకుండా మ్యానేజ్ చేశారని సమాచారం దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
క్లైమాక్స్ ట్విస్ట్ ఇదే..??
దేవకీ నందన వాసుదేవ ట్రైలర్ చూస్తే… ఓ వ్యక్తికి మేనల్లుడి వల్ల ప్రాణగండం ఉంటుంది. ఆ మేనల్లుడిని చంపడమే ఆ వ్యక్తి లక్ష్యం. కానీ, చివరికి ఆ వ్యక్తే చనిపోతాడు. ఇది శ్రీ కృష్ణుడు – కంసుడు మధ్య జరిగే కథే. దీన్నే ఇప్పుడు సినిమాగా చేస్తున్నారు. అయితే ఈ దేవకీ నందన వాసుదేవ సినిమా క్లైమాక్స్‌లో హీరోకి మేనమామ వల్ల ప్రాణాపాయం వస్తుందట. హీరో శ్రీ కృష్ణుడికి పెద్ద భక్తుడు. హీరోకి అపాయం రావడంతో, శ్రీ కృష్ణుడే స్వయంగా వచ్చి… విలన్‌ను చంపేస్తారట. ట్రైలర్‌లో కృష్ణ విగ్రహం చేతిలో కనిపించిన సుదర్శన చక్రంతోనే విలన్‌ను శ్రీ కృష్ణుడు చంపేస్తారట.
నిజానికి ఆ శ్రీ కృష్ణుడి పాత్రను సీజీ సాయంతో మహేష్ బాబు కనిపించేలా ప్లాన్ చేశారట మేకర్స్. మరి ఇప్పుడు సినిమాలో శ్రీ కృష్ణుడి పాత్రలో మహేష్ బాబే కనిపిస్తాడా.? లేదా అనేది తెలియాల్సి ఉంది.
కాగా, ఈ దేవకీ నందన వాసుదేవ మూవీ ఈ వారం నవంబర్ 14న రిలీజ్ కావాల్సింది. కానీ, ఇదే రోజు… కంగువ, మట్కా సినిమాలు రిలీజ్ కావడంతో వాయిదా వేసుకున్నారు. దీని తర్వాత నవంబర్ 22న ఈ మూవీ థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు.