TG Viswa Prasad : చిత్రపరిశ్రమలో సక్సెస్ ఫెయిల్యూర్ అన్నవి చాలా కామన్. కథ బాగుంటే ప్రేక్షకాదరణ చాలా వరకు అదే దక్కుతుంది. అయితే కొన్నిసార్లు సినిమా బాగున్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవచ్చు. మరి కొన్నిసార్లు ఎన్నో అంచనాలు పెట్టుకొని థియేటర్లకు వెళ్ళి చూసిన సినిమా చెత్త అనే ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మేకర్స్ తో పాటు నటీనటులు కూడా సైలెంట్ గా నెక్స్ట్ మూవీపై దృష్టి పెడతారు. అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత విశ్వ ప్రసాద్ (TG Viswa Prasad) ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) మూవీ ప్లాఫ్ అనే విషయాన్ని ఒప్పుకున్నారు. పైగా ఈ సినిమాపై ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Viswa Prasad) మాట్లాడుతూ “రవితేజ డేట్స్ ఉన్నాయి. క్విక్ గా ఏం చేద్దాం అనుకున్నప్పుడు క్విక్ గా ఈ ప్రపోజల్ ముందుకెళ్లింది. నేను ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రశ్నించాను.’ అని అడిగానని గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే రీమేక్ కంటే ఒరిజినల్ స్టోరీతో సినిమా చేస్తే బాగుంటుందనేది తన అభిప్రాయం అంటూ అప్పట్లో ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) మూవీ విషయంలో ఏం జరిగిందో వివరించారు. అయితే అప్పటికే ఈ సినిమా విషయంలో నిర్ణయం తీసుకునేసరికి ఆలస్యమైందని, చేసేదేం లేక ఏం మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.
కానీ ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమాను లక్నోలో తీయడం అన్నది జీవితంలోనే తను తీసుకున్న అతిపెద్ద చిత్త నిర్ణయం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నిర్మాత విశ్వ ప్రసాద్ (TG Viswa Prasad). అయితే నిజానికి 80ల నాటి హిందీ పాటలు తమకు నచ్చడంతో ఈ మూవీ ఆడుతుందని అనుకున్నామని అన్నారు. అదొక తప్పైతే, షూటింగ్ చాలా వేగంగా చేయడం అన్నది మరో మైనస్ పాయింట్ అయిందని చెప్పుకొచ్చారు. సినిమాలో కొన్ని సీన్స్ అయినా సరిగ్గా తీసి ఉండి ఉంటే మూవీ హిట్ అయ్యేదేమో అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు విశ్వ ప్రసాద్.
ఇంకా మాట్లాడుతూ యాక్షన్స్ సన్నివేశాల మీద మరింత దృష్టి పెట్టాల్సిందని, షూటింగ్ నెమ్మదిగా పూర్తి చేయాల్సిందని అన్నారు విశ్వప్రసాద్ (TG Viswa Prasad). దీంతో ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) ఫెయిల్యూర్ అంతా డైరెక్టర్ హరీష్ శంకర్ దేనా? అనుకుంటున్నారు. మొత్తానికి నిర్మాత విశ్వ ప్రసాద్ కామెంట్స్ తో మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఎవరు అన్న చర్చ నడుస్తోంది ఇప్పుడు టాలీవుడ్ లో.
కాగా ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాబ్’ అనే సినిమాకు టీజీ విశ్వప్రసాద్ (TG Viswa Prasad) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ వాయిదా పడగా, ప్రస్తుతం హరీష్ శంకర్ చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు.