OTT Movie: ప్రేక్షకులు అందరికీ అన్ని సినిమాలు నచ్చవు. ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా చూడటానికి ఇష్టపడుతుంటారు. అలానే థ్రిల్లింగ్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఉంటారు. తర్వాతే ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీతో థియేటర్లో కూర్చోవడం అనేది మామూలు విషయం కాదు. అది సాధారణ ప్రేక్షకుడికి మంచి థ్రిల్ ఇస్తుంది. అలాంటి సినిమాలు అతి తక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మలయాళంలో ఈ సినిమాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. తెలుగులో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకదాన్ని మించి ఒకటి బుర్ర చెదిరిపోయే ట్విస్టులు ఆ సినిమాలోనే ఉంటాయి. ఒక దానికి ఒకటి ఊహించకుండా సినిమాలో జరుగుతూ ఉంటుంది. ఇక ఆ జోనర్ సినిమా ఇష్టపడే ప్రేక్షకులకు ఇప్పుడు చెప్పబోయే సినిమా కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది.
మోహన్ లాల్ సెలక్షన్ ఆ రేంజ్ లో ఉంటుంది
దృశ్యం ఒరిజినల్ సినిమాను మొదట మోహన్ లాల్ నటించారు. ఆ తర్వాత మిగతా భాషల్లో కొంతమంది హీరోలు కనిపించారు. ఏ భాషలో చూసిన ఆ సినిమా కథ కు ఉన్న బలం వలన అది మంచి థ్రిల్ ఇస్తుంది. ఇక రీసెంట్ గా మోహన్ లాల్ నటించిన తుడరమ్ సినిమా కూడా అలానే ట్విస్టుల మీద ట్విస్టులతో ముడిపడి ఉంటుంది వినడానికి మామూలు కథల అనిపించినా కూడా ఆ స్క్రీన్ ప్లే మాత్రం ప్రేక్షకుడికి మంచి కిక్ ఇస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు అసలు మలయాళం వాళ్లకి ఇంత గొప్ప ఆలోచన ఎలా వస్తాయి అనే ఆలోచన మనలో పుడుతుంది. ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకులంతా కూడా ఇటువంటి సినిమాలను ఇష్టపడటం మొదలుపెట్టారు. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఖచ్చితంగా దీనిని చూడాల్సిందే.
సినిమా అసలు కథ
మధ్య తరగతి ట్యాక్సీ డ్రైవర్ అయిన షణ్ముగం అలియాస్ బెంజ్ తన బ్లాక్ అంబాసిడర్ కార్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అతను తన భార్య లలిత, కొడుకు పవన్, కూతరులతో సంతోషంగా జీవనం సాగిస్తుంటాడు. ఓ రోజు అనుకోకుండా అతని కారు యాక్సిడెంట్కు గురవుతుంది. దీంతో దానిని రిపేర్ కోసం ఇవగా, మెకానిక్ ఆ కారును చట్టవిరుద్ధమైన పనులకు వాడుకుంటాడు. దీంతో అతని కారును ఎలాగైనా తిరిగిపొందేందుకు బెంజ్ ఎస్ఐ బెన్ని ను కలుస్తాడు. ఈ కేసును సీఐ జార్జ్ మాథెన్ టేకప్ చేస్తాడు. ఆ తర్వాత పోలీసులతో బెంజ్ కు ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయి..? అసలు పోలీసులు బెంజ్ దగ్గర ఏదైనా దాచిపెట్టారా..? బెంజ్ అతని కారును తిరిగి పొందుతాడా..? అనేది సినిమా కథ.
Also Read : ‘తమ్ముడు’ విషయంలో దిల్ రాజు ఏంటీ ఇలా చేస్తున్నారు? వర్కవుట్ అయ్యేనా?