Nikhil: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ నిఖిల్ ఒకరు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన నిఖిల్ తర్వాత హీరోగా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. ముఖ్యంగా పరశురాం, చందు మొండేటి, సుధీర్ వర్మ వంటి దర్శకులు నిఖిల్ కెరియర్ కు మంచి ప్లస్ పాయింట్ గా మారారు. స్వతహాగా ఫ్రెండ్స్ కావడంతో నిఖిల్ కు మంచి హిట్ సినిమాలు అందించారు. ప్రస్తుతం నిఖిల్ స్థాయి మారిపోయింది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కార్తికేయ 2 సినిమా తర్వాత నిఖిల్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. తాను చేసిన ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది. ప్రస్తుతం నిఖిల్ స్వయంభు అనే సినిమా చేస్తున్నాడు.
సెట్లో అగ్ని ప్రమాదం
హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం జరిగినట్లు విశ్వసినీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో ఈ ఘటన జరిగింది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద. దీనితో ఈ సినిమాకు పని చేస్తున్న అసిస్టెంట్ కెమెరా మెన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మరికొంత మందికి గాయాలు అయినట్లు సమాచారం వినిపిస్తుంది. తీవ్ర నష్టం కూడా వాటిల్లింది. హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం వినిపిస్తుంది.