Malavika Sharma: ప్రముఖ బ్యూటీ మాళవికా శర్మ (Malavika Sharma) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో యువతను ఆకట్టుకున్న ఈమె.. తెలుగులో మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా నటించిన ‘నేల టికెట్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా వచ్చిన ‘రెడ్’ , గోపీచంద్ (Gopichand) తో ‘భీమా’, సుధీర్ బాబు (Sudheer Babu) తో కలిసి ‘హరోం హర’ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. తాజాగా ఒక పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కానీ ఎక్కువగా తన గ్లామర్ ఫోటోలతో పాటు రెగ్యులర్ అప్డేట్స్ మాత్రమే షేర్ చేసే ఈమె ఇప్పుడు సడన్గా హాస్పిటల్ లో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అందంతో, చలాకీతనంతో అందరినీ ఆకట్టుకునే మాళవికా శర్మ హాస్పిటల్లో కనిపించడమే కాదు హాస్పిటల్ డ్రెస్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఎప్పుడు గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకునే ఈమె సడన్గా ఈ వీడియో షేర్ చేయడం ఏంటి.. అంటూ ఫాలోవర్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఆ వీడియో కింద ఒక క్యాప్షన్ కూడా రాసుకుంది. “నవ్వండి.. ఎందుకంటే అనుకోకుండా హాస్పిటల్ డ్రెస్ లో ఇరుక్కొని పోయి.. చుట్టూ ఏవేవో మిషన్స్ ఉన్నప్పుడు అంతకంటే ఏం చేస్తాం.. అయినా ఈ డ్రెస్ లో కూడా అందంగా కనిపిస్తున్నాను” అంటూ షేర్ చేసింది మాళవిక. అయితే మాళవిక ఇలా హాస్పిటల్ డ్రెస్ లో కనిపించి లైట్ తీసుకున్నప్పటికీ ఆమె ఎందుకు ఇలా హాస్పిటల్లో ఉంది అనే విషయం తెలియక ఫాలోవర్లు అయోమయంలో పడ్డారు.
ఇక మాళవిక షేర్ చేసిన మరో ఫోటోలో ..”అందరూ ప్రశాంతంగా ఉండడానికి చిల్ అవుతారు. కానీ హాస్పిటల్ అడ్వెంచర్కు మాత్రం ఎవరు రెడీగా లేరంటూ ” క్యాప్షన్ రాసుకుంది. ఇక ఇదంతా కాస్త పక్కన పెడితే ఎందుకు ఈమె హాస్పిటల్ కి వెళ్ళింది. ఇలా వెళ్లడం వెనుక కారణమేంటి? అందులోనూ ఆమె హాస్పిటల్ డ్రెస్ వేసుకోవడం ఏంటి? అంటూ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఏదైనా నార్మల్ చెకప్ కోసం వెళ్లిందా లేక సమస్యతో ఇబ్బంది పడుతోందా అనే విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై క్లారిటీ రావాలి అంటే మాళవికా శర్మ స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే. మరి ఫాలోవర్స్ ఆత్రుతను తగ్గించడానికి అయినా మాళవిక ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.
మాళవికా శర్మ కెరియర్..
మాళవిక కెరియర్ విషయానికి వస్తే.. మోడల్గా కెరియర్ ఆరంభించి.. నటిగా ప్రస్తుతం చలామణి అవుతుంది. న్యాయవాది కూడా రవితేజతో కలిసి నేల టికెట్ సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఒకవైపు న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూనే మరొకవైపు నటనలో కూడా ప్రావీణ్యం పొందుతూ బిజీగా మారిపోయింది. ఇక తెలుగు, తమిళ్ మాత్రమే కాదు హిందీలో కూడా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.