BigTV English

Sandra Thomas: షూటింగ్ స్పాట్సే డ్రగ్స్ అడ్డాలు.. ప్రత్యేక గదుల్లో.. అంటూ బిగ్ బాంబ్ పేల్చిన నిర్మాత

Sandra Thomas: షూటింగ్ స్పాట్సే డ్రగ్స్ అడ్డాలు.. ప్రత్యేక గదుల్లో.. అంటూ బిగ్ బాంబ్ పేల్చిన నిర్మాత

Sandra Thomas: మలయాళ సినీ నిర్మాత, నటి సాండ్రా థామస్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మలయాళ చిత్ర పరిశ్రమ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. థామస్ మరోసారి పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదక దవ్యాలు వాడడమే కాకుండా, వాటిని స్టోర్ చేసుకుని మరి పంపిణీ చేస్తున్నారు అంటూ ఆరోపించారు. ఇటీవల ఇంటర్వ్యూలో థామస్ మాట్లాడుతూ.. సెట్ లో డ్రగ్స్ వినియోగం కోసం ప్రత్యేక బడ్జెట్లో గదులను కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. నిర్మాతలు ఫిర్యాదులు చేస్తే, సినిమాలను ఆపేస్తారేమో అన్న భయపడుతున్నారంటూ ఆమె తెలిపారు. మలయాళ సినీ పరిశ్రమపై థామస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


షూటింగ్ స్పాట్సే డ్రగ్స్ అడ్డాలు..

మలయాళ సినీ ఇండస్ట్రీలో సాండ్రా థామస్ కు మంచి పేరుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మళయాల చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వాడకం గురించి సంచలమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు సినిమా సెట్ లోను దీనికోసం ప్రత్యేకంగా గదులను కేటాయించడం, ప్రత్యేకంగా బడ్జెట్ ని కేటాయించడం కూడా జరుగుతుందని, షూటింగ్ స్పాట్సే డ్రగ్స్ అడ్డాలుగా మారిపోయాయి అని ఆమె తెలిపారు. ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇలా బహిర్గంగా ఎవరు దీని గురించి చెప్పరు. అలాంటిది ఇంటర్వ్యూలో చెప్పడం ఆమె ధైర్యానికి నిదర్శనం. ఇలా మాదక  ద్రవ్యాలు వాడడం వల్ల ఇండస్ట్రీలో ఎవరికైనా వారి ప్రతిష్ట నాశనం చేయడమే కాక, వారి సినిమాలు కూడా విజయం సాధించడంలో కష్టతరమవుతుంది అని తెలిపింది.


ప్రత్యేక గదుల్లో.. అంటూ బిగ్ బాంబ్ పేల్చిన నిర్మాత

థామస్ మాట్లాడుతూ .. ఐదు నుంచి పది సంవత్సరాల క్రితమే మాదక ద్రవ్యాలు వాడడానికి వ్యతిరేకంగా కొన్ని సంఘాలుగా ఏర్పడి వాటిని నిర్మూలించాల్సి ఉంది. కానీ ఎవరు అలా చేయలేదు. సెట్ లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ వారితో భవిష్యత్తులో ఏదోక అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరు ముందుకు రారు. చర్యలు తీసుకోరు. ఇప్పుడు దీనికోసం ప్రత్యేకంగా బడ్జెట్లను కూడా కేటాయిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రత్యేక గదులు ఏర్పాటు చేసిన నిర్వహించుతున్నారు. కేవలం ఒకరు ఇద్దరు వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమల నిందించలేమని తెలుసు అని ఆమె తెలిపారు.

ఇటీవల మోహన్ లాల్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాట్లాడడం తెలిసిందే. తన ఎన్జీవో విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా మోహన్ లాల్ తన పుట్టినరోజున డ్రగ్స్ వాడకంపై వ్యతిరేకంగా మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు విశ్వశాంతి ఫౌండేషన్ బి ఏ హీరో అనే పేరుతో ఒక సంవత్సరం పాటు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తుంది అని ఆయన తెలిపారు.

 

Monalisa : మోనాలిసా మోస పోలేదు.. స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ.. ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఇస్తుందో మీరే చూడండి

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×