BigTV English

Mallika Sherawat: ఇంట్లో తెలియకుండా ఆ పనిచేశాను, మా అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లింది.. మల్లికా షెరావత్ కామెంట్స్

Mallika Sherawat: ఇంట్లో తెలియకుండా ఆ పనిచేశాను, మా అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లింది.. మల్లికా షెరావత్ కామెంట్స్

Mallika Sherawat: బాలీవుడ్‌లో ఎంతోమంది బోల్డ్ బ్యూటీస్ ఉన్నారు. ఆన్ స్క్రీన్ ఎలా నటించడానికి అయినా వెనకాడరు. కొన్నేళ్లుగా అలాంటి బోల్డ్ బ్యూటీస్‌లో ఒకరిగా చలామణి అవుతోంది సన్నీ లియోన్. కానీ సన్నీ లియోన్ రాకముందు బాలీవుడ్ స్క్రీన్‌పై అసలైన బోల్డ్ బ్యూటీ అంటే మల్లికా షెరావత్. తన పేరు ఈరోజుల్లో ప్రేక్షకులు పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఒకప్పుడు తనకు బీ టౌన్‌లో ఉన్న పాపులారిటీ వేరే లెవెల్. ఆన్ స్క్రీన్ పాత్రల వల్లే కాదు.. ఆఫ్ స్క్రీన్ కాంట్రవర్సీల వల్ల కూడా మల్లికా చాలా ఫేమస్ అయ్యింది. ఇన్నాళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఈ భామ.. తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.


అబ్బాయి కాబట్టి

తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది మల్లికా షెరావత్. ‘‘నా తల్లిదండ్రులు నాకు, నా తమ్ముడికి మధ్య చాలా తేడా చూపించేవారు. నేను పెరుగుతున్న రోజుల్లో ఇదే విషయంపై చాలా బాధపడుతూ ఉండేదాన్ని. అప్పుడు చిన్నపిల్లను కాబట్టి వారు అలా ఎందుకు ప్రవర్తించేవారో నాకు తెలిసేది కాదు.. కానీ ఇప్పుడిప్పుడే ఆ విషయం నాకు అర్థమవుతోంది. తను అబ్బాయి కాబట్టి తనను విదేశాలకు పంపాలి, చదివించాలి, తనపై ఖర్చు పెట్టాలని అనుకునేవారు’’ అని తన చిన్నప్పటి చేదు జ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చింది మల్లికా షెరావత్.


Also Read: కొత్త అవతారం ఎత్తిన మహానటి.. అదుర్స్ కదా..!

ఎవరూ పెళ్లి చేసుకోరు

‘‘ఒక కుటుంబంలో ఉండే సంపద మొత్తం కొడుకుకు, మనవడికే వెళ్తుంది. మరి అమ్మాయిల పరిస్థితి ఏంటి? వాళ్లు పెళ్లి చేసుకొని వెళ్లిపోతారు కాబట్టి వాళ్లను ఒక భారంగా భావిస్తారు. ఆ విషయంలో నాకు చాలా బాధగా అనిపించేది కానీ నేను మాత్రమే కాదు.. మా ఊరిలోని ప్రతీ అమ్మాయి ఇదే అన్యాయానికి గురవుతుందని గ్రహించాను. నా తల్లిదండ్రులు నాకు అన్నీ ఇచ్చారు. మంచిగా చదువు చెప్పించారు కానీ మంచి ఆలోచనలను మాత్రం ఇవ్వలేకపోయారు. స్వేచ్ఛను ఇవ్వలేదు. వాళ్లు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నేను నా కుటుంబానికి తెలియకుండానే స్పోర్ట్స్ ఆడేదాన్ని ఎందుకంటే వారికి తెలిస్తే నువ్వు మగవాడిలాగా తయారవుతున్నావని చెప్పి నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు అనేవారు’’ అని గుర్తుచేసుకుంది మల్లికా.

అందరూ బాధపడ్డారు

‘‘మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. నేను పుట్టినప్పుడు నా కుటుంబమంతా బాధపడింది. నాకు తెలిసి మా అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లింది’’ అని చెప్పుకొచ్చింది మల్లికా షెరావత్. 2003లో గోవింద్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖ్వాషిష్’ అనే మూవీతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది మల్లికా. ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించిన ‘మర్డర్’తో ఒక్కసారి ఎనలేని పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో ఇమ్రాన్‌తో రొమాన్స్, గ్లామర్ షో.. ఇవన్నీ తన కెరీర్‌కు చాలా ప్లస్ అయ్యాయి. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మల్లికా.. రాజ్‌కుమార్ రావు హీరోగా తెరకెక్కిన ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’తో రీఎంట్రీకి సిద్ధమయ్యింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×