High Tension At Mohan Babu Home: రెండు మూడు రోజులుగా మోహన్ బాబు(Manchu Mohan Babu), మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇద్దరూ పరస్పర పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుకున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు దుబాయ్ నుంచి మంచు విష్ణు(Manchu Vishnu)కూడా చేరుకోవడంతో.. గొడవ జరిగే అవకాశం ఉందని గ్రహించిన మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు ఇంటిదగ్గర 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేశారు. అయితే వారికి పోటీగా మంచు మనోజ్ కూడా 30 మంది ప్రైవేట్ బౌన్సర్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో మోహన్ బాబు ఇంటిదగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
న్యాయ పోరాటం చేస్తున్న మనోజ్ దంపతులు..
ఇదిలా ఉండగా మరొకవైపు తన కుటుంబ సభ్యులు, తనకు అన్యాయం చేస్తున్నారని, తన కుటుంబ సభ్యులు తనపై దాడి చేసిన సీసీటీవీ ఫుటేజ్ ను తన అన్న మంచు విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ ధ్వంసం చేశాడని ఆరోపిస్తూ ఉన్నతాధికారులను మనోజ్ ఆయన భార్య మౌనిక కలుస్తున్నారు. ఇటీవలే డీజీపీ ని కలిసిన వీరు, గత కొంత సమయం క్రితం డిజి శివధర్ రెడ్డిని కూడా కలిశారు. తమకు రక్షణ కల్పించాలని మంచు మనోజ్ దంపతులు డీజీని కోరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కాసేపటి క్రితం జల్ పల్లి లోని నివాసానికి మంచు మనోజ్, మౌనిక చేరుకున్నారు. ఇక లోపలికి వెళ్లాలని కోరినా.. ఆ ఇంటి వద్ద సెక్యూరిటీ గేట్లు ఓపెన్ చేయలేదు. ఇక గేట్స్ ఓపెన్ చేయకపోవడంతో గేటు వద్దే మౌనిక, మనోజ్ దంపతులు ఉండిపోయారు.
గేట్లు ధ్వంసం చేసిన మనోజ్ సిబ్బంది..
అంతేకాదు తమ 7 నెలల కూతురు లోపల ఉందని, వెళ్ళాలి అంటూ మనోజ్ కారు దిగి మరీ సెక్యూరిటీని అభ్యర్థించారు. ఇక ఎంతసేపటికి మోహన్ బాబు సిబ్బంది గేట్స్ ఓపెన్ చేయకపోయేసరికి.. మనోజ్ తన బౌన్సర్స్ తో కలిసి ‘జైశ్రీరామ్’ అంటూ గేట్స్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఇక ఆ తోపులాటలో మనోజ్ సిబ్బంది గేట్లను ధ్వంసం చేయడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే మోహన్ బాబు సిబ్బంది మీడియా మిత్రులపై దారుణంగా, అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తించడం అమానుషం. ముఖ్యంగా మోహన్ బాబు మీడియా మిత్రులపై దౌర్జన్యం చేస్తూ కెమెరాలు పగలగొట్టేశారు. అంతేకాదు మోహన్ బాబు స్వయంగా టీవీ లోగో మైక్ లాక్కొని బుర్రలు పగిలేలా కొట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీన్ని బట్టి చూస్తే మోహన్ బాబు అలాగే ఆయన సిబ్బంది ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో అంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తతగా మారిపోయింది. ఏది ఏమైనా ఆస్తులు విషయంలోనే ఈ గొడవలు జరుగుతున్నాయి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగినా సరే అక్కడ వాతావరణం వేడెక్కింది.