Manchu Manoj: మంచు వివాదం ముదురుతోంది. గత రెండు రోజులుగా మంచు కుటుంబంలో ఆస్తి తగాదాలు రచ్చరేపుతున్నాయి. ఈ వివాదాల్లో భాగంగానే మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య దాడి జరిగింది. తండ్రీ కొడుకులు మాటల మధ్యలో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడినట్లు సమాచారం. మనోజ్ కార్యాలయానికి వెళ్లి, భార్య పిల్లలపై కూడా మోహన్ బాబు తన బౌన్సర్లతో దాడి చేయించాడు. ఆ దాడిలో తగిలిన దెబ్బలతోనే మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన తండ్రి తనపై దాడి చేయించాడని, తనకు, తన భార్యకు తండ్రి నుంచి ప్రాణ హానీ ఉందని తెలిపాడు.
Manchu Mohan Babu: మీడియాపై మోహన్ బాబు దౌర్జన్యం.. కెమేరాలు పగలగొట్టిన సెక్యూరిటీ
ఇంకోపక్క మోహన్ బాబు సైతం.. కొడుకు మీద ఫుర్యాదు చేశాడు. తన ఇంటిని లాక్కోవడానికి కొడుకు, కోడలు తనపై దాడికి పాల్పడ్డారని, సీనియర్ సిటిజన్ అయిన తనకు ప్రొటక్షన్ కావాలని తెలిపాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మంచు విష్ణు అమెరికా నుంచి రావడం.. మనోజ్ ను ఇంటి బయటకు గెంటేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. గేటు వద్దనే మంచు మనోజ్, భార్య మౌనిక నిలబడడం జరిగింది. ఆ తరువాత తమకు న్యాయం చేయాలనీ మనోజ్ దంపతులు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కలిసి విన్నవించుకున్నారు.
ఇక తాజాగా మంచు మనోజ్ దంపతులు.. జలపల్లి లోని మంచు టౌన్ చేరుకున్నారు. మోహన్ బాబు ఇంటి గేటువద్ద లోపలి వెళ్ళడానికి ప్రయత్నించారు. లోపల బౌన్సర్లు గేటు తీయకపోవడంతో మనోజ్ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. తన కూతురును లోపల పెట్టుకొని తమకు ఇవ్వడం లేదని, తన కూతురుకు ఏదైనా అయితే ఊరుకొనేది లేదని మనోజ్ ఫైర్ అయ్యాడు.
Manchu Manoj Wife Mounika: మీరు న్యాయంగా చెయ్యండి… దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయ్
బౌన్సర్లను దాటుకొని గేటును తోసుకుంటూ లోపలి వెళ్లిన అతని నిరాశనే ఎదురయ్యింది. ఇంట్లోకి వెళ్లనివ్వకుండా మోహన్ బాబు బౌన్సర్లు అడ్డుకున్నారు. మనోజ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మనోజ్ చొక్కా చినిగిపోయింది. అయినా కూడా వెనక్కి తగ్గకుండా మనోజ్ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కూతురిని తనకు అప్పగించాలని కోరాడు.
నా కూతురు దగ్గరకు వెళ్లకుండా కొట్టిస్తున్నాడని మనోజ్ ఆరోపించాడు. మంచు మనోజ్ – భూమా మౌనికపై ఈ ఏడాదే ఒక ఆడపిల్ల పుట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె మోహన్ బాబు ఇంట్లోనే ఉంది. కూతురును తమకు ఇవ్వాలని మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.