జల్పల్లిలో మోహన్ బాబు(Mohan Babu)ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు మంటలు రేపుతున్నాయి. గతంలో మంచు మోహన్ బాబు కుమారులైన మంచు విష్ణు(Manchu Vishnu), మంచు మనోజ్(Manchu Manoj)మధ్య గొడవలు జరగగా.. ఇప్పుడు ఏకంగా మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు, మనోజ్ మరొకవైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మనోజ్ పై దాడి చేస్తున్నారనే విధంగా పరిస్థితులు అనిపిస్తున్నాయి. ఇక మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే.. పోటీగా మనోజ్ 30 మంది బౌన్సర్లను రంగంలోకి దింపాడు.
పాప వుందని వేడుకున్నా.. కనికరించని మోహన్ బాబు సిబ్బంది..
ఇక దీంతో అసలు ఆ ఇంటి వద్ద ఏం జరుగుతోంది?అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తన తండ్రి మంచు మోహన్ బాబు తనకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాలని, తనకు రక్షణ కావాలి అని, తన భార్య, బిడ్డను కాపాడాలంటూ మనోజ్ అధికారులను కలుస్తున్నారు. అందులో భాగంగానే తన ఏడు నెలల పాపను ఇంట్లో వదిలేసి దంపతులిద్దరూ డీజీపీ , డీజీని కలిసి రక్షణ కావాలని కోరి, తిరిగి ఇంటికి వచ్చారు. అయితే ఇంటికి వచ్చే సమయంలో గేటు వద్ద మంచు మోహన్ బాబు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. లోపల పాప ఉందని, పాప దగ్గరకు వెళ్లాలని వేడుకున్నా సరే కనికరించలేదు. దీంతో మనోజ్ ఆక్రోషంతో గేట్లు ధ్వంసం చేసి మరీ లోపలికి వెళ్లిపోయారు.
మీడియా మిత్రులపై మోహన్ బాబు రౌడీయిజం..
అయితే అదే సమయంలో మీడియా మిత్రులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా.. వారిపై మోహన్ బాబు రౌడీయిజం చూపించారు. మీడియా ప్రతినిధి టీవీ మైక్ లాక్కొని మరీ బుర్ర పగలగొట్టడం మనం విజువల్స్ లో చూడవచ్చు. అసలు లోపల ఏం జరుగుతోందో అని తెలుసుకోవడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు రౌడీయిజం చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పలువురు మీడియా మిత్రులకు గాయాలు కూడా అయ్యాయి. కొడుకుపై కోపాన్ని ఆపుకోలేక ,పరువు గంగలో కలుస్తుందనే నేపథ్యంలో మీడియా ప్రతినిధులపై దారుణంగా దాడి చేశారు మోహన్ బాబు.
మోహన్ బాబు గన్ సీజ్ చేసిన పోలీసులు..
అక్కడితో ఆగకుండా బూతులు తిడుతూ గన్ సైతం బయటకు తీయడంతో అక్కడే ఉన్న పహారీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు గన్ లాక్కొని సీజ్ చేశారు.మొత్తానికైతే మోహన్ బాబు రౌడీయిజం బయటపడిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మోహన్ బాబు ఇలా సడన్గా సహనాన్ని కోల్పోయి, విచక్షణ రహితంగా దాడి చేస్తూ రౌడీ లాగా బిహేవ్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈయనలో ఇంత కోపం ఉందా అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇంటి లోపలికి వెళ్ళిన మనోజ్, మౌనిక దంపతులు అసలు అక్కడ ఏం చేస్తున్నారు..? కుటుంబంతో తెగ దెంపులు చేసుకొని శాశ్వతంగా బయటికి రాబోతున్నారా? అనే విషయాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏది ఏమైనా మంచు కుటుంబంలో గొడవలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇకపోతే గడిచిన 24 గంటలలో తండ్రి కొడుకులు ఇద్దరు పరస్పర కంప్లైంట్ చేసుకున్న విషయం తెలిసిందే.