Manchu Manoj: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడు మోహన్ బాబు తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. విలన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా కూడా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. కేవలం మంచి గుర్తింపు సాధించుకోవడమే కాకుండా తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. అయితే నటనపరంగా మోహన్ బాబుని తియ్యడానికి లేదు. ఏ పాత్ర ఇచ్చినా కూడా దానికి సంపూర్ణ న్యాయం చేస్తారు మోహన్ బాబు. మోహన్ బాబు కెరియర్ లో ఎన్నో పాత్రలకి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. అయితే చాలామందికి నచ్చని అంశం ఏమిటంటే మోహన్ బాబు రియల్ లైఫ్ ఉండే విధానం.
ఒక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు గారిని ఉద్దేశిస్తూ నేను తనకంటే గొప్ప నటుడిని అని ఆన్ స్టేజ్ చెప్పుకున్నాడు. అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా దానికి తన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. అలానే మోహన్ బాబు ఒక అవార్డు ఫంక్షన్ లో మాట్లాడిన విధానం కూడా తీవ్రమైన చర్చలకు అప్పట్లో దారితీసింది. ఎన్నో సందర్భాలలో మోహన్ బాబు మాట్లాడిన తీరు ప్రేక్షకులలో ఒక అసంతృప్తిని క్రియేట్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం మోహన్ బాబు ఇంట్లో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. ఇవి అన్ని కుటుంబాలలో జరిగిన కూడా మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్నప్పుడు ఎందుకు హైలెట్ అవుతున్నాయి అని అంటే, ఎప్పుడూ క్రమశిక్షణ గురించి మాట్లాడే మోహన్ బాబు నేడు క్రమశిక్షణ తప్పి విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు అనేది కొంతమంది వాదన.
ఇకపోతే దాదాపు రెండు సంవత్సరాల క్రితం మంచు మనోజ్ ను మంచు విష్ణు ఇంటికొచ్చి కొట్టినట్లు ఒక వీడియో వైరల్ అయింది. అయితే దానికి సమాధానం ఇస్తూ అది ఒక రియాలిటీ షో అంటూ కవర్ చేశాడు విష్ణు. 2023 లో వస్తుంది అనుకున్న ఆ రియాలిటీ షో 2024 దాటిపోతున్న కూడా ఇప్పటికి రిలీజ్ కాలేదు. అయితే తన తండ్రి మోహన్ బాబు అనుచరులు తనపై దాడి చేశారు అంటూ మనోజ్ కంప్లైంట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు దీనిపై స్పందిస్తూ అవేమీ నిజం కాదు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అంటూ చెప్పేశారు. అది జరిగిన కాసేపటికి మంచు మనోజ్ హాస్పిటల్లో చేరడం తీవ్రమైన అనుమానాలకు దారితీసింది. ఇక ఈ విషయం ఇప్పుడు చాలా పెద్దదిగా మారింది కాసేపట్లో పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్ రానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడా లేదంటే తన బాధలన్నీ పోలీసులతో చెప్తాడు అనేది కాసేపట్లో తెలియనుంది.
Also Read : Pushpa 2 4day’s Collections: 5 రోజుల్లోనే రూ.1000 కోట్ల చేరువలో ‘పుష్ప’రాజ్.. సరికొత్త రికార్డ్..!