Horror Movie In OTT : ఈ ఏడాది చాలా హారర్ మూవీస్ థియేటర్లలో రిలీజ్ అయ్యి సందడి చేశాయి. బ్లాక్ బాస్టర్ సినిమాలు ఎన్నో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. అందులో సూపర్ హిట్ కామెడీ మూవీ భూల్ భాలయ్య 3 కూడా ఒకటి. కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, తృప్తి డిమ్రి, మాధురీ దీక్షిత్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. ఈ మూవీ గత నెల 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ కామెడీగా, భయపెట్టేలా ఉండటంతో జనాలను థియేటర్లలోకి వచ్చేలా చేసింది. దాంతో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసేలా కలెక్షన్స్ ను అందుకొని రికార్డు సృష్టించింది. ఈ మూవీ నెలలోపే ఓటీటీలోకి రావడం విశేషం. ఇక ఆలస్యం ఎందుకు ఆ మూవీ ఓటీటీ డీటెయిల్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..
ఈ హారర్ మూవీ కేవలం 150 కోట్లతో తెరకెక్కింది. థియేటర్లలో పెద్దగా పాజిటివ్ టాక్ ను అందుకోలేదు కానీ 400 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డు బ్రేక్ చేసేసింది. గతంలో వచ్చిన రెండు సినిమాల కంటే కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో ఇండియన్ సినిమాగా నిలిచింది.. హిట్ టాక్ ను అందుకున్న ఈ మూవీ డిసెంబర్ 27 వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతుందని తెలుస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..
ఇక ఈ హారర్ కామెడీ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి చాలా హారర్ కామెడీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో స్త్రీ2, ముంజ్యాలాంటి మూవీస్ అందులో ఉండగా.. భూల్ భులయ్యా 3 కూడా బ్లాక్‌బస్టర్ అయింది. అనీస్ బజ్మీ నటించిన ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, తృప్తి డిమ్రి, మాధురీ దీక్షిత్ వంటి స్టార్ నటీనటులు నటించారు. గతంలో వచ్చిన రెండు సిరీస్ ల కంటే ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ మూవీ హారర్ తోపాటు కామెడీని కూడా మిక్స్ చేసి ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 27 న ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రాబోతుంది. అలాగే ఈ మూవీ థియేటర్లలో మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇక్కడ ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని టాక్.. ఇక ఈ ప్లాట్ ఫామ్ లో వచ్చే కొత్త సినిమాలు అన్ని మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం లక్కీ భాస్కర్ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది.. రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ మంచి వ్యూస్ ను అందుకుంటుంది.