BigTV English

Pushpa 2 4day’s Collections: 5 రోజుల్లోనే రూ.1000 కోట్ల చేరువలో ‘పుష్ప’రాజ్.. సరికొత్త రికార్డ్..!

Pushpa 2 4day’s Collections: 5 రోజుల్లోనే రూ.1000 కోట్ల చేరువలో ‘పుష్ప’రాజ్.. సరికొత్త రికార్డ్..!

Pushpa 2 4day’s Collections:ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్(Allu Arjun) ‘పుష్ప 2’ సినిమా అదరగొడుతోంది. హిట్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. సౌత్, నార్త్, ఓవర్సీస్ అంటూ తేడా లేకుండా అన్నిచోట్ల కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక తాజాగా నాలుగు రోజుల అధికారిక కలెక్షన్స్ ను కూడా అనౌన్స్ చేశారు చిత్ర బృందం. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల గ్రాస్ వసూలు చేసి, మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఈ చిత్రం. అప్పటివరకు ఉన్న ‘బాహుబలి 2’, ‘RRR’ రికార్డులను సైతం తిరగరాసింది ఈ సినిమా. అంతే కాదు ఇప్పట్లో ఏ హీరో కూడా ఈ రేంజ్ ని టచ్ చేయడం అసాధ్యం అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.


నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్లు..

రెండు రోజుల్లోనే రూ.449 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం పోస్టర్ ను విడుదల చేసింది. అలాగే మూడు రోజుల్లో ఏకంగా రూ. 621 కోట్ల గ్రాస్ వసూలు చేసిన పుష్ప 2, ఆదివారం కావడంతో ఆదరణ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా సౌత్ తో పోల్చుకుంటే నార్త్ లో పుష్ప 2 సినిమాకి కలెక్షన్లు భారీగా పెరిగిపోయాయి. నిన్న ఒక్కరోజే సుమారుగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఇకపోతే పుష్ప -2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అలాగే ఓవర్సీస్ లో మొత్తం కలుపుకొని నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం పోస్టర్ తో సహా అధికారికంగా ప్రకటించింది..


రూ.1000 కోట్లకు చేరువలో పుష్పరాజ్..

మొత్తానికి అయితే అల్లు అర్జున్ ఆల్ టైం రికార్డ్ సృష్టించారని చెప్పవచ్చు. ఊహించిన దానికంటే పుష్ప 2 కి కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. మూడు రోజులకు రూ .620 కోట్ల ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు నాలుగు రోజులకు ఆదివారం కలిసి రావడంతో రూ .800కోట్ల వరకు వస్తాయని అంచనా వేశారు. కానీ నార్త్లో రోజురోజుకీ థియేటర్స్, షోలు పెరుగుతుండడంతో ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది. ఇక రేపటితో రూ.1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అత్యంత వేగంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా పుష్ప -2 సినిమా నిలుస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు రూ.1000 కోట్లకు కేవలం రూ.171 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. ఇక రేపు లేదా ఎల్లుండి లోపు ఈ కలెక్షన్స్ రాబట్టడం ఈ సినిమాకు పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా నాలుగు రోజుల్లోనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ అంటే బన్నీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పడంలో సందేహం లేదు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా, శ్రీ లీల స్పెషల్ సాంగ్లో చేసి అలరించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×