Manchu Lakshmi: మంచు వారసురాలు మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం లక్ష్మీ.. హైదరాబాద్ నుంచి పూర్తిగా ముంబైకు మకాం మార్చేసింది. గత కొన్నిరోజులుగా మంచు బ్రదర్స్ మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నా.. మంచు అక్క మాత్రం తనకేమి సంబంధం లేదన్నట్లు ప్రశాంతంగా రీల్స్ చేసుకుంటూ కనిపిస్తుంది.
మంచు మనోజ్ కు లక్ష్మీ చాలా క్లోజ్.. సొంత తమ్ముడు విష్ణు అయినా కానీ, ఎక్కువ లక్ష్మీ.. మనోజ్ కే సపోర్ట్ చేస్తూ వచ్చింది. మొదట్లో అక్కాతమ్ముళ్లు కలిసే ఉన్నా.. ఎప్పుడైతే మనోజ్ సైడ్ లక్ష్మీ మాట్లాడిందో అప్పటినుంచి విష్ణు.. అక్కను దూరం పెట్టాడు. మనోజ్ కు. మౌనికకు దగ్గర ఉండి పెళ్లి చేయించింది కూడా లక్ష్మీనే. అప్పుడప్పుడు ఆమె హైదరాబాద్ వచ్చినా మనోజ్ నే కలిసి వెళ్తుంది. ఇక ఆస్తి తగాదాల మధ్యలో ఒకసారి మోహన్ బాబు ఇంటికి వచ్చి వెళ్లిన లక్ష్మీ.. ఆ తరువాత హైదరాబాద్ కు వచ్చింది లేదు.
ఎప్పటి నుంచో ఆమె ముంబైలో మకాం పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే అక్కడ అంతా సెట్ చేసుకొని.. గతేడాది చివర్లోనే ముంబై షిఫ్ట్ అయ్యింది. ఇక మంచు వివాదాలాతో తనకేమి సంబంధం లేనట్టే.. ముంబైలోనే అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక అక్కడకు వెళ్ళగానే మంచు లక్ష్మీ కూడా అందాల ఆరబోత చేయడం స్టార్ట్ చేసింది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
TJ Harshavardhan: నా భార్య నన్ను వేధిస్తోంది.. నటిపై ఫిర్యాదు చేసిన డైరెక్టర్ హర్షవర్ధన్
అయితే తాజాగా మంచు లక్ష్మీ.. ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై మండిపడింది. తనను వారు వేధించారని ఇండిగో ఎయిర్ లైన్స్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తన ఆవేదనను చెప్పుకొచ్చింది. ” ఇది కచ్చితంగా వేధించడమే. నా లగేజ్ బ్యాగ్ ను పక్కకి తోసేశారు. నాతో దురుసుగా ప్రవర్తించారు. కనీసం బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. చివరికి నా లగేజ్ కు సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. వాళ్ళు చెప్పింది వినకపోతే నా బ్యాగ్స్ ను గోవాలోని వదిలేస్తామన్నారు.
ఒకవేళ నా బ్యాగ్స్ లో ఏదైనా వస్తువు మిస్ అయితే ఆ సంస్థ బాధ్యత తీసుకుంటుందా.. ? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్ లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు. ఇకనుంచి ఈ ఎయిర్ లైన్స్ కు నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. నాలాగే ఎంతోమంది ప్రయాణికులు ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కుంటున్నారు” అంటూ మండిపడింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో చాలామంది మంచు లక్ష్మీకి సపోర్ట్ చేస్తున్నారు. తమకు కూడా ఇలాగే జరిగిందని.. సిబ్బంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు.
This is harassment @IndiGo6E 😭 after all that they did not even put a security tag in front of my eyes. In spite of insisting that they would do so if anything is missing, I doubt Indigo will take any responsibility. How is this even possible to run an airline like this?
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025