Yoga For Long Hair: ప్రతి ఒక్కరూ పొడవాటి, మందపాటి జుట్టును ఉండాలని కోరుకుంటారు. కానీ చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు కాలుష్యం జుట్టుపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. తరచుగా ప్రజలు జుట్టు రాలడం, జుట్టు పెరుగుదల లేకపోవడం , నిర్జీవమైన, పొడి జుట్టు గురించి ఇబ్బంది పడుతుంటారు. ఈ జుట్టు సమస్యలను పరిష్కరించడానికి, ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అంతే కాకుండా వివిధ రకాల షాంపూలు, కండిషనర్లు , ఆయిలంస్ వాడుతుంటారు. కానీ పొడవాటి , మందపాటి జుట్టు కోసం ఖరీదైన ఉత్పత్తులపై ఆధారపడవలసిన అవసరం లేదు.
ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా, మీరు ఇంట్లోనే యోగా చేయడం ద్వారా మీ జుట్టును పెంచుకోవచ్చు. రెగ్యులర్ యోగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక , శారీరక ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. కొన్ని ప్రత్యేక యోగా ఆసనాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, జుట్టును బలోపేతం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వేలల్లో ఖర్చు పెట్టి హెయిర్ ఆయిల్స్, షాంపూలను కొనుగోలు చేసి వాడినా కూడా కొన్ని సార్లు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ఇంట్లోనే యోగా చేయడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది.
పొడవాటి, మందపాటి జుట్టు కోసం యోగా :
అధో ముఖ స్వనాసనం:
ఈ ఆసనాన్ని చేయడానికి శరీరాన్ని విలోమ V ఆకారంలో ఉంచి చేతులు, కాళ్లను చదునైన ఉపరితలంపై ఉంచండి.మీ కాళ్ళను నిటారుగా , మడమలను నేలపై ఉంచండి. అధో ముఖ స్వనాసనం తల వైపు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు మూలాలకు పోషణను అందిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడానికి ప్రధాన కారణమైన ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
శీర్షాసనం:
మీ కాళ్లను నిటారుగా ఉంచి తలను వంచి కాళ్లకు తగిలేలా ఉండండి. ఈ సమయంలో మీ రెండు చేతులతో కాళ్లకు సపోర్ట్ గా ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా శరీరాన్ని బ్యాలెన్స్ చేయండి. కొంతకాలం ఈ స్థితిలో ఉండండి. ఈ ఆసనం తలలో రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఉత్తనాసనం:
నిటారుగా నిలబడి నడుమును నెమ్మదిగా వంచండి. మీ చేతులను క్రిందికి తీసుకురండి . వాటితో మీ కాలి వేళ్ళను తాకడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో, మెడ , తల పూర్తిగా వదులుగా వదిలివేయండి. ఉత్తనాసనం జుట్టు మూలాలకు ఆక్సిజన్ , పోషకాల ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే డీహైడ్రేషన్ , అలసటను తొలగిస్తుంది.
Also Read: మీ చర్మం తెల్లగా మెరిసిపోవాలా ? అయితే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి
బాలాసనం:
ఈ ఆసనం చేయడానికి మీ మోకాళ్లపై కూర్చుని, శరీరాన్ని ముందుకు వంచండి. అప్పుడు మీ నుదిటిని నేలపై ఉంచేటప్పుడు మీ చేతులను ముందుకు చాచండి. తర్వాత లోతైన శ్వాస తీసుకోండి .ఈ స్థితిలో విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనాన్ని చేయడం వల్ల స్కాల్ప్‌లో రక్త ప్రసరణ పెరగడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. శరీరాన్ని రిలాక్స్ చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.