BigTV English

US Tik Tok Phone On Demand : టిక్ టాక్ ఉన్న పాతఫోన్ ధర రూ.43 కోట్లు.. ఆన్‌లైన్ లో ఫుల్ డిమాండ్

US Tik Tok Phone On Demand : టిక్ టాక్ ఉన్న పాతఫోన్ ధర రూ.43 కోట్లు.. ఆన్‌లైన్ లో ఫుల్ డిమాండ్

US Tik Tok Phone On Demand | అమెరికా టిక్ టాక్ అభిమానులు విలవిల్లాడుతున్నారు. అగ్రరాజ్యంలో ఈ షార్డ్ వీడియో యాప్ కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఇటీవల టిక్ టాక్ పై నిషేధం విధించడంతో ఆ యాప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో చాలామంది టిక్ టాక్ ని తమ ఫోన్ల నుంచి తొలగించేశారు. కానీ ఆ యాప్ తిరిగి 12 గంటల్లో పున:ప్రారంభమైంది. కానీ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు పడలేదు. ఈ రెండు యాప్ స్టోర్లు కూడా టిక్ టాక్ ని తమ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించేశాయి. దీంతో టిక్ టాక్ అలవాటు ఉన్న అమెరికన్లు ఆ యాప్ ముందుగానే ఇన్స్‌టాల్ చేసి ఉన్న ఫోన్ల కోసం ఎగబడుతున్నారు. వారి ఆత్రుతను అవకాశంగా చేసుకొని ‘ఈ బే’ లాంటి ఆన్ లైన్ విక్రయాలు చేసే ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ఫుల్లుగా క్యాష్ చేసుకుంటున్నాయి. తాజాగా టిక్ టాక్ యాప్ కలిగిన ఒక పాత ఐఫోన్ ధర అక్షరాలా రూ.43 కోట్లు (5 మిలియన్ డాలర్లు) పలికింది.


న్యూ యార్క్ పోస్ట్ లో ప్రచురితమైన కథనం ప్రకారం.. ఈ బే ప్లాట్ ఫామ్ పై టిక్ టాక్ ఇన్‌స్టాల్ చేసి ఉన్న ఒక ఐఫోన్ ధర 5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.43 కోట్లు)కు అందుబాటులో ఉంది. ఈబే లో ఇచ్చిన యాడ్ ప్రకారం.. ఐఫోన్ 15 ప్రో, 128 జిబి మాడల్ విక్రయానికి ఉంది. కేవలం దాని స్క్రీన్ ప్రొటెక్షన్ డ్యామేజ్ అయంది. ఫోన్ అంతా వర్కింగ్ కండీషన్ లో ఉందని వివరంగా యాడ్ లో ఉంది.

ఒక ఈబే లోనే కాదు.. సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా అమెరికా యూజర్లు టిక్ టాక్ ఇన్‌స్టాల్ చేసి ఉన్న ఇతర స్మార్ట్ ఫోన్ల అయినా సరే తాము కొనుగోలు చేస్తామని తెగ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ట్విట్టర్ ఎక్స్ లో ఒక యూజర్ అయితే తన ఫోన్ లో టిక్ టాక్ డెలీట్ చేశానని.. కానీ తనకు తిరిగి ఆ యాప్ కావాలనిపిస్తోందని పోస్ట్ పెట్టాడు. యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు లేకపోవడంతో ఎవరైనా టిక్ టాక్ ఇన్ స్టాల్ చేసి ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ విక్రయించాలనుకుంటే తాను 5000 డాలర్లు (దాదాపు రూ.4లక్షల 32 వేలు) చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని రాశాడు.


Also Read:  ప్రపంచ జనాభా తగ్గుతోంది.. మరో 100 సంవత్సరాల్లో 20-50 శాతం తగ్గుదల!

జనవరి 19, 2025 నుంచి అమెరికాలో టిక్ టాక్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే అమెరికాలో సగం జనాభా టిక్ టాక్ షార్ట్ వీడియో యాప్ ఉపయోగిస్తోంది. జనవరి 19న నిషేధం అమలులోకి రావడంతో యాప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో చాలా మంది ఇక టిక్ టాక్ అందుబాటులోకి లేదని భావించి తమ ఫోన్ల నుంచి దాన్ని డెలీట్ చేశారు. కానీ యాప్ తిరిగి 12 గంటల్లో లైవ్ లోకి వచ్చింది. దీంతో తాము పెద్ద పొరపాటు చేశామని యూజర్లు గమనించి బాధపడుతున్నారు.

గూగుల్, యాపిల్ స్టోర్లలో డౌన్ లోడ్ చేసుకునేందుకు టిక్ టాక్ అందుబాటులో లేదు. జనవరి 19 నుంచి అమెరికాలో ఆండ్రాయిడ్ ఫోన్స్ వినియోగించే యూజర్లు ఎవరైనా టిక్ టాక్ డౌన్లోడ్ లేదా అప్డేట్ చేసుకోవాలని ప్రయత్నిస్తే.. వారికి “అమెరికా చట్టాల ప్రకారం.. ఈ యాప్ డౌన్ లోడ్ తాత్కాలికంగా నిలిపివేయబడింది.” అని మెసేజ్ వస్తోంది. ఐఫోన్ యూజర్లకు కూడా ఇలాంటిదే మెసేజ్ కనిపిస్తోంది. “టిక్ టాక్ బైట్ డాన్స్ యాప్లన్నీ ప్రస్తుతం దేశంలో మీ ప్రాంతంలో అందుబాటులో లేవు ” అని ఐఫోన్ యూజర్లకు మెసేజ్ చూపిస్తోంది.

అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఆయన తిరిగి ఈ యాప్ సేవలు ప్రారంభించారు. కానీ గూగుల్, యాపిల్ యాప్ పై ఉన్న నిషేధం పూర్తిగా తొలగించాలని.. లేదా తాము టిక్ టాక్ యాప్ తమ ప్లాట్ ఫామ్స్ పై అందుబాటులోపెడితే తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

అంతర్జాతీయ రూటర్స్ మీడియా కథనం ప్రకారం.. టిక్ టాక్ యాప్ అమెరికా కార్యకలాపాలు ఏదైనా అమెరికన్ కంపెనీ కొనుగోలు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. టిక్ టాక్ కొనుగోలు చేసేందుకు ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ ముందంజలో ఉన్నారు. అందుకే ఏదైనా అమెరికన్ కంపెనీ టిక్ టాక్ కొనుగోలు చేసేంతవరకు అమెరికా యూజర్లకు టిక్ టాక్ కష్టాలు తప్పవు మరి.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×