BigTV English

Manchu Lakshmi : తమ్ముడికి వెరైటీగా లచ్చక్క బర్త్ డే విసెష్.. దుమ్ము లేపిందిగా..

Manchu Lakshmi : తమ్ముడికి వెరైటీగా లచ్చక్క బర్త్ డే విసెష్.. దుమ్ము లేపిందిగా..

Manchu Lakshmi : టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ నేడు 42 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయనకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. అలాగే రాజకీయ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు మోహన్ బాబు కానీ, మంచు విష్ణు కానీ ఎక్కడ మనోజ్ కి విషెస్ చెప్పినట్టు కనిపించలేదు. మంచు లక్ష్మి మాత్రం సోషల్ మీడియా ద్వారా మనోజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


తమ్ముడికి మంచు లక్ష్మీ బర్త్ డే విషెస్..

మంచు మోహన్ బాబు కూతురుగా మంచు లక్ష్మి తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే వ్యాఖ్యాతగా సింగర్ గా కూడా ఆమె రాణిస్తూ ప్రేక్షకుల మనసులో మంచి చోటుని సంపాదించుకుంది. ఈమధ్య సినిమాలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఈమె పేరు వినిపిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న లచ్చక్క లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే వీడియోని షేర్ చేసింది.. ఆ వీడియోలో మంచు లక్ష్మి ఆమె కూతురుతో పాటు స్టాఫ్ కూడా డాన్స్ చేసి మరి మనోజ్ కి విషెస్ చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఇలా కూడా బర్త్డే విషెస్ చెప్తారా లచ్చక్క అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏదిఏమైన అయితే ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతుంది.


Also Read : స్పిరిట్ పై ఆశలు వదులుకోవాల్సిందేనా..? రూటు మార్చిన వంగా..

మంచు మనోజ్ ‘ భైరవం’.. 

మంచు మనోజ్ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈమధ్య కుటుంబ వివాదాలతో హైలైట్ అయ్యాడు. ఒకవైపు కుటుంబ వివాదాలు ఉన్నా కూడా మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు మంచు మనోజ్.. ఈ మూవీలో ఈయనతో పాటుగా నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది. ఆ ట్రైలర్ ని చూస్తుంటే సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ మూవీ తర్వాత మిరాయి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు మంచు మనోజ్..

?utm_source=ig_web_copy_link

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×