BigTV English

Nikhil: అహంకార యుద్ధంలో ఓడిపోయిన వాడే గెలుస్తాడు కావ్య పై నిఖిల్ పోస్ట్.

Nikhil: అహంకార యుద్ధంలో ఓడిపోయిన వాడే గెలుస్తాడు కావ్య పై నిఖిల్ పోస్ట్.

Nikhil: బుల్లితెర యాక్టర్ నిఖిల్ అంటే తెలియని వారు ఉంటారేమో గానీ, బిగ్ బాస్ 8 విజేత నిఖిల్ అంటే మాత్రం తెలియని వారు ఉండరు. గోరింటాకు సీరియల్ తో తెలుగువారి మనసు దోచాడు. ఈ సీరియల్ లోని హీరోయిన్ గా కావ్య శ్రీ నటించారు. ఇద్దరూ కలిసి తర్వాత సోషల్ మీడియాలో వీడియోస్ పెడుతూ అందరికీ దగ్గరయ్యారు. బిగ్ బాస్ తో అందరి ఇళ్లలో ఒక  మనిషిగా కలిసిపోయాడు నిఖిల్. నటి కావ్య శ్రీ తో, ఫ్రెండ్షిప్ చేసి అది ప్రేమగా మారి ఇద్దరు ఎంతోకాలం కలిసే ఉన్నారు. కానీ అనుకోని కారణాలవల్ల ఇద్దరూ విడిపోయారు. బిగ్ బాస్  నుంచి వెళ్లిన తర్వాత నిఖిల్ కావ్య గురించి ఎక్కడా మాట్లాడలేదు. నిఖిల్ కావ్య కలుస్తారని అందరూ అనుకున్నారు కానీ, ఇంతవరకు ఇద్దరు కలిసి ఎక్కడ కనిపించలేదు. ఇద్దరూ కలిసి ఎలాంటి ప్రాజెక్టుని చెయ్యట్లేదు. అయితే తాజాగా మా టీవీ చిన్ని సీరియల్ లో ఏసీపీ విజయ్ పాత్రలో నిఖిల్ కనిపించాడు. ఆ సీరియల్ మెయిన్ క్యారెక్టర్ లో కావ్య శ్రీ నటిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడడంతో అభిమానులు ఆనందించారు. అయితే ఎక్కువ కాలం నిఖిల్ సీరియల్ లో కొనసాగలేదు. ఇన్ని రోజుల తర్వాత నిఖిల్ సోషల్ మీడియా వేదికగా, పోస్ట్ పెట్టాడు. తాజాగా నిఖిల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వివరాలు చూద్దాం..


ఈ పోస్ట్ కావ్య కోసమేనా ..

ఇక నిఖిల్ కావ్య ఇద్దరు, కలిసి చిన్ని సీరియల్ లో తాజాగా కనిపించారు. విజయ్ పాత్రలో, సీరియస్ యాంగ్రీ మెన్ గా నటించారు. కావేరీ పాత్రలో కావ్య నటిస్తోంది. అందులో కావేరీ ని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ గా వస్తాడు. కానీ అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా హీరో కావేరీని కాపాడుతాడు. తర్వాత విజయ్ క్యారెక్టర్ మళ్లీ తిరిగి వస్తా అంటూ ముగిస్తారు. అసలు ఇంత అర్ధాంతరంగా నిఖిల్ పాత్రను ముగించడానికి కారణం వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లేకపోవడమేనని.. ఇద్దరికీ ఇంకా గొడవలు జరుగుతుండడంతో కావ్యకి ఇష్టం లేదు. కావున, సీరియల్ నుంచి నిఖిల్ ని తొలగించారని అనుకున్నారు. అది నిజమా కాదా అని అందరూ అనుకునే టైంలో ఇప్పుడు నిఖిల్ అహంకార యుద్ధంతో ఓడిన వాడే గెలుస్తాడు అని పోస్ట్ పెట్టాడు. ఇదంతా కావ్య మీదే అని అందరూ అనుకుంటున్నారు. ఈ పోస్ట్ పై కావ్య స్పందించలేదు.


నిఖిల్,కావ్య బంధం.. 

ఇక బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ కావ్య మీద ప్రేమను బయట పెట్టాడు. నేను తన కోసమే బతుకుతున్నాను. నువ్వు కొట్టినా తిట్టినా పడతాను. నీ ముందు ఈ సీజన్ అయిపోగానే ప్రత్యక్షమవుతాను. నాకు నువ్వు కావాలి. నువ్వే నా భార్యవి అని ఎమోషనల్ గా చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ కలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ కావ్య ఆ టైంలో స్పందించలేదు. తర్వాత నిఖిల్ చేసే పోస్టులకు కామెంట్స్ పెడుతూ తనను నమ్మనని చాలాసార్లు బహిర్గతంగానే చెప్పింది. ఇప్పుడు నిఖిల్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. నోటిలో సిగరెట్ పెట్టుకొని చేతిలో కత్తితో నిఖిల్ యాంగ్రీ, హ్యాండ్సమ్ గా ఉన్న ఫోటోను ఇన్స్టాల్ లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతుంది.

Naveen Chadra : త్రివిక్రమ్ అయినా సరే… ఈయన కండీషన్స్ కి ఒప్పుకోవాల్సిందే..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×