Manchu Lakshmi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు వారసులు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు (Mohan Babu)వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విష్ణు,మనోజ్ ,లక్ష్మి ప్రసన్న ముగ్గురు కూడా సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కృషి చేస్తున్నారు. ఇక మంచు విష్ణు(Manchu Vishnu) తన సొంత నిర్మాణంలోనే సినిమాలు చేస్తూ వచ్చారు. ఇక ఇటీవల మనోజ్(Manoj) కూడా భైరవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిది సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను తన నటనతో సందడి చేశారు.
ఇక మంచు వారసురాలు అయిన లక్ష్మీప్రసన్న (Lakshmi Prasanna) గురించి చెప్పాల్సిన పనిలేదు. లక్ష్మీ ప్రసన్న ప్రస్తుతం వివిధ సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కృషి చేస్తున్నారు.. ప్రస్తుతం ముంబై వెళ్ళిన ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మంచు లక్ష్మి పాల్గొనడంతో ఆమెకు కన్నప్ప సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. కన్నప్ప సినిమా(Kannappa Movie) విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అనే సంగతి తెలిసిందే.
విడుదలకు సిద్ధమైన కన్నప్ప…
ఈ సినిమా కోసం దాదాపు పది సంవత్సరాలు పాటు విష్ణు కష్టపడుతున్నారని, ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయటానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల గుంటూరులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇలా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న నేపథ్యంలో మంచు లక్ష్మీకి కూడా కన్నప్ప సినిమా గురించి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. విష్ణు కన్నప్ప సినిమాలో మీరు ఎందుకు నటించలేదు అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు మంచు లక్ష్మి ఊహించని సమాధానం చెప్పారు.
ఫ్యామిలీ సినిమా అవుతుంది…
నన్ను ఎందుకు ఈ సినిమాలో తీసుకోలేదో మీరు విష్ణుని అడగాలి అంటూ ఈమె సమాధానం చెప్పారు. నేను నటిస్తే ఈ సినిమాలో నటించిన వారు ఎవరు కనిపించరని ఈమె సరదాగా సమాధానం చెప్పారు. ఈ సినిమాలో నేను చేయగలిగే పాత్ర లేకపోవడంతోనే విష్ణు నాకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఒకవేళ నేను చేయగలిగే పాత్ర ఉంటే ఇచ్చి ఉండేవాడేమో. ఇక మేమంతా కలిసి అన్ని సినిమాలో నటిస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది అంటూ లక్ష్మి మంచు సమాధానం ఇచ్చారు. ఇక ఈ సినిమాలో మనోజ్ కూడా నటించలేదు కదా అని తెలిపారు. ఇక మీ బ్రదర్స్ కి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందా అనే ప్రశ్న ఎదురవడంతో సినిమాలలో అవకాశం ఇవ్వకపోవటానికి సపోర్ట్ చేయకపోవడానికి సంబంధం లేదు. నా మద్దతు వాళ్లకు ఎప్పుడూ ఉంటుంది అంటూ ఈ సందర్భంగా మంచు లక్ష్మి సమాధానం చెప్పారు. ఇటీవల మంచు కుటుంబంలో గొడవ చోటు చేసుకున్న నేపథ్యంలో మంచు లక్ష్మి ఈ గొడవ గురించి ఎప్పుడు స్పందించకపోయినా, మనోజ్ కి మాత్రం పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు.