Manchu Manoj: మంచు మనోజ్ (Manchu Manoj)దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత భైరవం సినిమా(Bhairavam Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సొంతం చేసుకున్నారు. మంచు మనోజ్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఇంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే భైరవం సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు.
ఇప్పుడే మొదలైంది…
ఇక ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ కు రిపోర్టర్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీ తొమ్మిది సంవత్సరాల ఆకలి తీరింది కదండీ అంటూ రిపోర్టర్ ప్రశ్నించడంతో లేదండి ఇప్పుడే మొదలైంది అంటూ మనోజ్ సమాధానం ఇచ్చారు. ఈ సినిమాలో కొన్ని చోట్ల మిమ్మల్ని చూస్తున్నప్పుడు స్వయంగా మోహన్ బాబు గారిని చూసినట్టు అనిపించింది.. అలాగే సినిమా మార్నింగ్ షో పడగానే సోషల్ మీడియా వేదికగా మీరు ఆయన కొడుకు వచ్చారని చెప్పు అంటూ పోస్ట్ కూడా చేశారు. ఈ సినిమాలో మీ వాయిస్, డిక్షన్, మేనరిజం మోహన్ బాబుతో సిమిలర్ గా అనిపించింది! కావాలని చేశారా? లేకుంటే ఇన్ బిల్ట్ గా వచ్చిందా అంటూ ప్రశ్నించారు.
అదే నాకు గొప్ప ఆస్తి…
ఈ ప్రశ్నకు మంచు మనోజ్ సమాధానం చెబుతూ… డిఎన్ ఏ ప్రభావం. నేను నాన్నగారి నుంచి తీసుకున్న గొప్ప ఆస్తి ఇదే అంటూ మంచు మనోజ్ చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక మంచు మనోజ్ నాన్న నుంచి తీసుకున్న ఆస్తి ఇదేనని చెప్పడంతో ఇది కాస్త ట్రెండ్ అవుతుంది. గత కొద్ది రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ గొడవలు ఆస్తి కోసమే అనే వాదన కూడా తెరపైకి వచ్చింది.
మోహన్‌బాబు గారి నుంచి నాకు వచ్చి ఆస్తి అది..!: మంచు మనోజ్ pic.twitter.com/vpWW8Lsvtq
— ChotaNews App (@ChotaNewsApp) June 1, 2025
ఇక మంచు మనోజ్ కు పలు సందర్భాలలో ఆస్తి కోసమే గొడవలు జరుగుతున్నాయా అని ప్రశ్నలు కూడా ఎదురవడంతో ఆస్తులు కోసం కాదని, యూనివర్సిటీ కోసం అంటూ మంచు మనోజ్ చెబుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈయన నాన్న నాకు ఇచ్చిన ఆస్తి అదే అని చెప్పడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. తొమ్మిది సంవత్సరాల తర్వాత మనోజ్ వెండితెరపై కనిపించినప్పటికీ ప్రేక్షకుల నుంచి అదే స్థాయిలో ఆదరణ వచ్చిందని, సినిమా గురించి ఎంత నెగిటివ్ ప్రచారం చేసిన ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను ఎవరు ఆపలేకపోయారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు ఇక ఈ సినిమా విషయంలో మీడియా సపోర్ట్ కూడా బాగుందని మనోజ్ మీడియాకు, అభిమానులకు ప్రేక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.. ఇక మనోజ్ ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలకు కూడా కమిట్ అవుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు.