Manchu Manoj: మంచు మనోజ్ (Manchu Manoj)ఇటీవల కాలంలో సినిమాల ద్వారా కంటే కూడా తన వ్యక్తిగత విషయాలు, ఫ్యామిలీ గొడవల కారణంగా తరచూ వార్తలలో నిలుస్తున్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు వెండితెరకు దూరమైన మంచు మనోజ్ తిరిగి “బైరవం”(Bhairavam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసినదే. విజయ్ కనకమెడల దర్శకత్వంలో నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ నటిస్తున్న ఈ చిత్రం మే 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
నాన్నకు నేను వ్యతిరేకం కాదు..
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇక మంచు మనోజ్ కు ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమా కంటే కూడా ఎక్కువగా తన ఫ్యామిలీ గొడవల గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే మనోజ్ తన ఫ్యామిలీలో జరిగిన గొడవల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ నాన్నగారు అంటే నాకు చాలా అమితమైన గౌరవం, ప్రేమ ఉంది. నాన్నకు వ్యతిరేకంగా నేనెప్పుడూ మాట్లాడలేదు, ఆయనపై కేసు కూడా పెట్టలేదు. నాన్నగారు మహిళలకు ఎంతో గౌరవం ఇస్తారు, అలాంటిది తల్లిదండ్రులు లేని ఒక ఆడపిల్ల ఇంటికి కోడలుగా వస్తే ఆ అమ్మాయి పై కేసు పెట్టారు అంటే ఎవరు నమ్మరు.
అమ్మను ఆపటం ఎవరి తరం కాదు..
నేను ఆ పని చేశాను, ఈ పని చేశానని చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చూపించమంటే చూపించరు. మా ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు గురించి కూర్చుని మాట్లాడదామంటే మాట్లాడటానికి కూడా రారు. ఇక నాన్నతో నాకున్న గొడవ ఆస్తి గురించి అసలు కాదు. నాన్నకు నేను దూరం అవుతుంటే మౌనిక(Mounika) కూడా చాలా బాధపడుతుంది. ఇక అమ్మ నాకు చాలా మంచి ఫ్రెండ్, అమ్మ ఇప్పటికి మా ఇంటికి వస్తూ వెళ్తుంది. అమ్మను ఎవరూ ఆపలేరు. అమ్మను ఆపటం ఎవరి తరం కాదు.. అమ్మ నా వద్దకు రాకుండా ఆపి చూస్తే తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేరని మనోజ్ తెలిపారు. ఇలా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు గురించి మరోసారి మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అయితే మనోజ్ గొడవ ఆస్తి గురించి కాదని యూనివర్సిటీ గురించి అని పలు సందర్భాలలో తెలియచేశారు.
అదేవిధంగా నా గొడవ తన అన్నయ్య విష్ణుతో మాత్రమేనని ,తన తండ్రితో కాదని ఈ విషయాలన్నీ తన తండ్రి మోహన్ బాబు(Mohan Babu) గారితో మాట్లాడకుండా విష్ణు అడ్డుపడుతున్నారంటూ పలు సందర్భాలలో మనోజ్ గొడవ గురించి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసినదే. ఈ విధంగా మనోజ్ తరచూ తన కుటుంబంలో జరిగే గొడవలు గురించి మాట్లాడుతున్నప్పటికీ విష్ణు(Vishnu) మాత్రం ఎక్కడ ఈ గొడవల గురించి సరైన విధంగా స్పందించడం లేదు. ఇక విష్ణు కూడా ప్రస్తుతం కన్నప్ప(Kannappa) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నారు.