BigTV English
Advertisement

Manchu Manojm Look in MIRAI: మంచు మనోజ్ ‘మిరాయ్’ లుక్.. కత్తి లుక్ మామూలుగా లేదు భయ్యా..!

Manchu Manojm Look in MIRAI: మంచు మనోజ్ ‘మిరాయ్’ లుక్.. కత్తి లుక్ మామూలుగా లేదు భయ్యా..!

Manchu Manoj Look in Teaja Sajja’s MIRAI Movie: ఒక్క సినిమా చాలు నటీ నటుల్ని ఓవర్ నైట్‌లో స్టార్లుగా మార్చడానికి. అలాంటి ఒక్క ఛాన్స్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. వచ్చిన ఆ ఒక్క అవకాశాన్ని సరైన విధంగా ఉపయోగించుకుని మంచి స్థాయికి ఎదుగుతున్నారు. అయితే ఇందులో ముందు వరుసలో ఉంటాడు యంగ్ హీరో తేజ సజ్జ. ‘చూడాలని ఉంది’ సినిమాతో బాల నటుడిగా సినీ రంగం ప్రవేశం చేసిన తేజ.. ఆ తర్వాత 2019లో ‘ఓ బేబీ’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీఎంట్రీ ఇచ్చాడు.


ఇక 2021లో అతడికి వచ్చిన ఓ మంచి ఛాన్స్‌ను వినియోగించుకున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘జాంబీ రెడ్డి’ సినిమాలో హీరోగా ఛాన్స్ కొట్టేశాడు. ఈ మూవీ సరికొత్తగా, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కడంతో మంచి హిట్ అయింది. దీంతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ మూవీ తర్వాత మళ్లీ వీళ్లిందరూ ఒక్కటయ్యారు. ‘హనుమాన్’ మూవీతో వచ్చిన ప్రశాంత్ – తేజ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు.

ఒక చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా.. అదీ సంక్రాంతి టైంలో.. బడా హీరోల సినిమాలకు పోటీగా ‘హనుమాన్’ రిలీజ్ అయింది. ఇక ఆ సమయంలో ఈ మూవీ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా బడా హీరోల సినిమాలనే వెనక్కి నెట్టి సంక్రాంతి రేసులో విన్నర్‌గా నిలిచింది. అంతేకాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ.300 కోట్లు కలెక్ట్ చేసి అందిరినీ అబ్బురపరచింది.


Also Read: తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమాలో టాలీవుడ్ మరో మాస్ హీరో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

అయితే ఈ మూవీ తర్వాత తేజ తగు జాగ్రత్తలు తీసుకుంటూ కథలను ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ‘ఈగల్’ మూవీ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో ‘మిరాయ్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇటీవలే టైటిల్ అండ్ తేజ సజ్జ ఫస్ట్‌లుక్‌తో ఓ టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్ బట్టి ఈ మూవీ కూడా తేజకు బ్లాక్ బస్టర్ ఇచ్చేలా అనిపిస్తుంది. ఫుల్ మాస్ యాక్షన్ సీన్లతో సినిమా టీజర్ అదిరిపోయింది. ఇదిలా ఉంటే ఈ మూవీలో మంచు మనోజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అతడికి సంబంధించి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్‌ను అందించారు. ఇందులో భాగంగా మంచు మనోజ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో మనోజ్ కత్తి పట్టుకొని ‘ది బ్లాక్ స్వార్డ్’గా పరిచయం చేస్తూ.. అందుకు సంబంధించిన గ్లింప్స్‌ను రేపు (మే 20)న మార్నింగ్ 11.34 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. మరి మనోజ్‌కు సంబంధించిన గ్లింప్స్ టీజర్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి.

Also Read: Mirai Manchu Manoj: అన్నా.. ఏంటన్నా ఆ ఫైట్స్.. ఏమన్నా ఉందా గ్లింప్స్.. గూస్ బంప్స్ వచ్చాయ్

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×