BigTV English
Advertisement

Manchu Manoj : రూటు మార్చిన మంచు మనోజ్.. డిఫరెంట్ స్టోరీతో మూవీ..

Manchu Manoj : రూటు మార్చిన మంచు మనోజ్.. డిఫరెంట్ స్టోరీతో మూవీ..

Manchu Manoj : టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ గురించి ఈమధ్య సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తన తండ్రితో ఆస్తి విషయాల్లో విభేదాలు రావడంతో కోర్టుకు ఎక్కారు అన్న విషయం తెలిసిందే.. ఈ కేసు ఇంక నడుస్తూనే ఉంది. అయితే దీని గురించి పక్కన పెడితే మంచు మనోజ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. భైరవం’ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్‌లతో కలిసి నటిస్తున్నారు. ఇది మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. అలాగే ‘మిరాయ్’ అనే పాన్ ఇండియా మూవీలో కనిపించనున్నారు. ఇది ఆగస్టులో రానుంది. అయితే మనోజ్ రీసెంట్ గా మరో ప్రాజెక్ట్ కు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మూవీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..


చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ..

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ సినిమా చేసి దాదాపు 8 ఏళ్లు పూర్తయింది. ఈయన సోలో హీరోగా ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ మిక్స్డ్ డిటాక్ ని అందుకోవడంతో ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ వరుస సినిమాలతో బిజీగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్లిన సినిమాలు హోల్డ్ లో పడటం, అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ అనుకున్న విధంగా షూటింగ్ జరుపుకోకపోవడంతో మనోజ్ కి చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.బైరవం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమా ఈనెల 30వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అలాగే తేజ సజ్జ కాంబినేషన్లో మిరాయ్ సినిమా చేస్తున్నారు. కూడా త్వరలోనే విడుదల కాబోతుంది. అయితే ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


Also Read :అతని వల్ల మోసపోయాను.. చిట్టి మనసులో ఇంత బాధ ఉందా..?

డిఫరెంట్ కాన్సెఫ్ట్ తో మనోజ్ కొత్త మూవీ.. 

“అత్తరు సాయిబు” అనే టైటిల్ తో మంచు మనోజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. ’90 ML’ డైరెక్టర్ శేఖర్ రెడ్డి ఎర్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. పేరుకి తగ్గట్టుగానే డిఫరెంట్ స్టోరీతో మూవీ ఉండబోతుందని సమాచారం. ఈ మూవీ గురించి పూర్తి వివరాలను మే 20వ తారీఖున అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మనోజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గురించి పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్. మరి ఈ సినిమాలో మనోజ్ ఎలా కనిపించబోతున్నాడో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×